కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్లాస్ మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా భారీ లెవల్ లో ఈ నెల 20న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా అవడానికి క్లాస్ మూవీ అయినా కూడా అటు తమిళ్ లో ఇటు…
తెలుగు లో కూడా సినిమా మంచి బిజినెస్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకి ఎక్స్ లెంట్ బిజినెస్ ఆఫర్స్ సొంతం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమాకి ఆంధ్ర ఏరియాకి గాను సాలిడ్ బిజినెస్ డీల్ క్లోజ్ అయిందని తెలుస్తుంది.
ఈ వీక్ లో రిలీజ్ అవ్వాల్సిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం కూడా ఇప్పుడు కుబేర మూవీ నే ఈ నెలలో ఫస్ట్ బిగ్ రిలీజ్ అయ్యేలా చేయడం, మంచి క్రేజీ కాంబో అవ్వడంతో బిజినెస్ పరంగా మంచి ఆఫర్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా…
ఇప్పుడు కోస్టల్ ఆంధ్ర ఏరియాకి గాను ఆల్ మోస్ట్ 18 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను కుబేర సినిమా సొంతం చేసుకుందని సమాచారం. ఆల్ మోస్ట్ 120 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో సినిమా తెరకెక్కగా ఆల్ రెడీ డిజిటల్ బిజినెస్ పరంగా 47 కోట్ల రేంజ్ లో ఆఫర్ ను సొంతం చేసుకున్న సినిమా…
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ బిజినెస్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా మిగిలిన ఏరియాల్లో కూడా సినిమాకి ఎక్స్ లెంట్ బిజినెస్ డీల్స్ క్లోజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది..ఓవరాల్ గా మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న కుబేర బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక..