Home న్యూస్ సార్ మూవీ 2.65 కోట్లు….కుబేర ఒక్క నైజాంలోనే డే 1 ఎంతంటే!!

సార్ మూవీ 2.65 కోట్లు….కుబేర ఒక్క నైజాంలోనే డే 1 ఎంతంటే!!

0

కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన ఫస్ట్ తెలుగు మూవీ సార్ రెండేళ్ళ క్రితం రిలీజ్ అయినప్పుడు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ధనుష్ కి తెలుగు లో మంచి మార్కెట్ సొంతం అయ్యేలా చేసింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు కింగ్ నాగార్జున(Nagarjuna)తో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ కుబేర(Kuberaa Movie)…

అల్టిమేట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు. ఏ రేంజ్ లో అంటే ఏకంగా ధనుష్ నటించిన సార్ మూవీ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని మించిన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…సార్ మూవీ మొదటి రోజు టోటల్ గా…

తెలుగు రాష్ట్రాల్లో 2.65 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా…ఇప్పుడు ఆ కలెక్షన్స్ ని ఆల్ మోస్ట్ ఒక్క నైజాంలోనే మొదటి రోజు కుబేర సినిమా సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల బ్రాండ్…నాగార్జున స్పెషల్ అట్రాక్షన్ లు కలిసి వచ్చిన కుబేర సినిమా..

మొదటి రోజు నైజాంలో మరీ అనుకున్న రేంజ్ లో షోలు పడక పోయినా కూడా ఓవరాల్ గా 2.62 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. అంటే సార్ మూవీ టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని…

కుబేర సినిమా ఒక్క నైజాంలోనే మొదటి రోజు సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు అల్టిమేట్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ లో ధనుష్ అండ్ నాగార్జున కెరీర్ లో సాలిడ్ రికార్డులతో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here