తమ వాళ్ళతో పాటు వేరే వాళ్ళని కూడా ఆదరించే అలవాటు కొంత మందికే ఉంటుంది….మన టాలీవుడ్ ఆడియన్స్ మన హీరోల సినిమాలతో పాటు మంచి సినిమా అనిపిస్తే ఇతర ఇండస్ట్రీ ల సినిమాలను కూడా ఎగబడి చూస్తూ ఉంటారు…తమిళ్ మలయాళం కన్నడ లేటెస్ట్ గా హిందీ అని కూడా చూడకుండా మంచి సినిమా అనిపిస్తే…
టాలీవుడ్ ఆడియన్స్ ఆదరించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, కానీ అదే టైంలో మన సినిమాలను తమిళ్ ఆడియన్స్ చాలా రేర్ గానే ఆదరించారు…ఆ సినిమాల్లో ఉన్నది తమ హీరోలు అయినా కూడా వాళ్ళు ఆదరించిన సినిమాలు తక్కువే…ఇతర సినిమాల విషయంలో అంటే…
ఏమో అనుకోవచ్చు కానీ లేటెస్ట్ గా కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush)ల కాంబో మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా లో ధనుష్ అంటే బాగానే ఆదరించే తమిళ్ ఆడియన్స్ ఈ రేంజ్ లో యునానిమస్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాను కూడా…
ఏమాత్రం ఆదరించకపోవడం మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్యర్యపరుస్తుంది. తమిళ్ హీరో అయినా కూడా మన దగ్గర ఎక్స్ లెంట్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో అంచనాలను మించి ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ సినిమాకి మంచి లాభాలను తెచ్చే పని లో ఉంటే…
తమిళనాడులో తమ హీరో నటించిన సినిమానే అయినా వర్కింగ్ డే లో కేవలం 1.35 కోట్ల లోపే గ్రాస్ ను అందుకుని భారీగా డ్రాప్ అయిన కుబేర ఇప్పుడు అక్కడ నష్టాలనే సొంతం చేసుకోబోతుంది. ఆల్ మోస్ట్ 18 కోట్ల బిజినెస్ కి సినిమా ఇప్పటి వరకు అక్కడ…
7.35 కోట్ల రేంజ్ లోనే షేర్ ని అందుకోగా ఇంకా 11 కోట్లకు పైగా షేర్ ని 22 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక్కడ దెబ్బ పడినా కూడా ఓవరాల్ గా కుబేర వరల్డ్ వైడ్ గా లాభాలను అందుకునే అవకాశం ఉంది.