Home న్యూస్ కుబేర మూవీ బడ్జెట్ అండ్ ఓటిటి బిజినెస్….మాస్ రచ్చ ఇది!!

కుబేర మూవీ బడ్జెట్ అండ్ ఓటిటి బిజినెస్….మాస్ రచ్చ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెలలో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్లాస్ మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా మీద ఆడియన్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో…

అంచనాలు ఉండగా ఆల్ రెడీ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ డీసెంట్ లెవల్ లో అంచనాలను అయితే పెంచాయి అని చెప్పాలి. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది బిజినెస్ డీల్స్ గురించిన అప్ డేట్స్ కూడా వస్తూ ఉండగా…

ఓవరాల్ గా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ తో కుబేర సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఆల్ మోస్ట్ సినిమా కోసం 120 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ను పెట్టారట. బైలింగువల్ గా సినిమా రూపొందుతూ ఉండటంతో..

ఈ రేంజ్ బడ్జెట్ పెట్టినా కూడా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతూ ఉండగా రీసెంట్ గా సినిమా ఓటిటి బిజినెస్ కంప్లీట్ అవ్వగా సాలిడ్ రేటుని సినిమా సొంతం చేసుకుందని తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సినిమా డిజిటల్ రైట్స్ కోసం అన్ని భాషలకు కలిపి ఏకంగా….

47 కోట్ల రేంజ్ లో సాలిడ్ రేటు చెల్లించి హక్కులను తీసుకున్నారట. ఇంకా శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇతర రైట్స్ వివరాలు రావాల్సి ఉండగా ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే సినిమా సాలిడ్ రికవరీని ఇప్పుడు సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here