బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మంచి అంచనాల నడుమ కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో రూపొందిన మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది…శేఖర్ కమ్ముల సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనిపించే రేంజ్ లో కథ ఉంటుంది. మరి ఈ సారి శేఖర్ కమ్ముల ఎంతవరకు అంచనాలను అందుకున్నాడో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే ఇది లక్ష కోట్ల స్కాం కథ…బాగా డబ్బున్న వాళ్ళకి ఏమి లేని వాళ్ళకి మధ్య జరిగిన గొడవకథ…బెగ్గర్స్ ను వాడుకుని కోట్లకు కోట్లు హవాలా ద్వారా డబ్బును బ్లాక్ నుండి వైట్ గా చేసే క్రమంలో అనుకోకుండా ఒక బెగ్గర్ అయిన హీరో సీన్ లోకి ఎంటర్ అవ్వడంతో ఊహించని ములుపు ఎంత దూరం వెళ్ళింది అన్నది ఓవరాల్ గా కుబేర కథ..
ముందుగా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి….నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ధనుష్ మరోసారి ఆ అవార్డ్ కి అర్హుడిని అనిపించే రేంజ్ లో పెర్ఫార్మెన్ తో చెడుగుడు ఆడేసుకున్నాడు…తన డైలాగ్స్, నటన టాప్ నాట్చ్ అనిపించేలా మెప్పించింది. తను తప్ప ఆ రోల్ కి మరెవ్వరూ సూట్ కారేమో అనిపించే రేంజ్ లో నటించాడు ధనుష్.
ఇక కింగ్ నాగార్జున ఇది వరకు చేసిన రోల్స్ తో పోల్చితే కంప్లీట్ గా సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా కొన్ని సీన్స్ లో సాలిడ్ యాక్టింగ్ తో మెప్పించాడు. ఇక రష్మిక ఉన్న చిన్న రోల్ లో ఆకట్టుకోగా జిమ్ శర్బ్ విలనిజం కూడా బాగా మెప్పించింది. మిగిలిన యాక్టర్స్ తమ రోల్స్ వరకు బాగా నటించారు.
ఇక సినిమాకి మరో హీరో దేవి శ్రీ ప్రసాద్, తన మ్యూజిక్ కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఒకప్పటి వింటేజ్ దేవి శ్రీ ప్రసాద్ ను గుర్తు చేసింది అని చెప్పాలి. కొన్ని సీన్స్ స్లో అయినా తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు దేవి… ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ కుమ్మేయగా సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయిన ఫీలింగ్ కలిగింది… కానీ బాగుంది.
సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక శేఖర్ కమ్ముల తనదైన డైరెక్షన్ తో ఫుల్ మార్కులు కొట్టేశాడు…అందరి నుండి ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ ను రాబట్టుకున్న కమ్ముల కథ పరంగా మంచి పాయింట్ ను తీసుకుని మంచి ఎమోషన్స్ ని మిక్స్ చేసి అంచనాలను మించి పోయాడు..
ఒక్క లెంత్ విషయంలో అలాగే కొన్ని చోట్ల డ్రాగ్ అయిన ఫీలింగ్ తప్పితే కుబేర సినిమా ఎక్కడా కూడా అంచనాలను తప్పలేదు…లెంత్ కొంచం తగ్గించి ఉంటే కనుక ఇంతకుమించిన రెస్పాన్స్ వచ్చి ఉండేది…ఓవరాల్ గా ఈ ఇయర్ వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో..
కుబేర సినిమా ముందు నిలిచే సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు…ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ మూవీస్ లో కూడా ఒకటిగా నిలుస్తుంది… లెంత్ విషయంలో ఆడియన్స్ కొంచం కన్విన్స్ అయితే కుబేర మీ అంచనాలను మించుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు…సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 3.25 స్టార్స్…