కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో రూపొందిన మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో 1700 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న సినిమా ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది…
కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ మెయిన్ కోర్ పాయింట్ బిగ్ షాట్ అయిన ఒక బిజినెస్ మాస్ దగ్గర పని చేసే నాగార్జున కొందరు రోడ్ సైడ్ ఉండే బెగ్గర్స్ ని వాడుకుని భారీ డబ్బుని బ్లాక్ నుండి వైట్ చేస్తూ ఉంటాడు…
ఈ క్రమంలో ఒక బెగ్గర్ అయిన హీరో ధనుష్ నాగార్జున లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది…ఆ తర్వాత కథలో వచ్చిన ట్విస్ట్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…సినిమా ఓపెన్ అవ్వడం నార్మల్ గానే ఓపెన్ అవ్వగా అసలు కథ లోకి హీరో ఎంటర్ అయ్యాక…
సినిమా ఆసక్తి కరంగా మారి స్క్రీన్ ప్లే పరంగా మంచి జోరుని చూపెడుతూ సీన్ బై సీన్ ఇంటర్వెల్ వరకు ఫుల్ రేసీగా సాగి ఇంటర్వెల్ ట్విస్ట్ సెకెండ్ ఆఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెంచగా ఓవరాల్ గా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో అనిపించేలా మెప్పించగా…
ఇక సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయినా కూడా కొంచం స్క్రీన్ ప్లే అక్కడక్కడా బోర్ ఫీల్ అయ్యేలా చేసినా కూడా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు ఆసక్తిగా సాగి ఓవరాల్ గా సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపిస్తూ మొత్తం మీద సినిమా…
ఎండ్ అయ్యే టైంకి ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ చూసిన ఫీలింగ్ తో పాటు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ని కలిగించడం ఖాయమని చెప్పాలి. మొత్తం మీద 3 గంటల లెంత్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కథ ఆసక్తిగానే సాగగా కొన్ని చోట్ల మంచి హై ఇచ్చే సీన్స్ తో…
శేఖర్ కమ్ముల తన మ్యాజిక్ ని చూపించగా దేవి శ్రీ ప్రసాద్ ఎక్స్ లెంట్ మ్యూజిక్ అండ్ లీడ్ యాక్టర్స్ అందరి ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ తో మూడు గంటల సినిమా అయ్యే సరికి ఆడియన్స్ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి రావడం ఖాయమని అంటున్నారు.
ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో అనిపించే రేంజ్ లో మెప్పించింది అని చెప్పాలి. ప్రీమియర్స్ నుండి ఓవరాల్ గా సినిమాకి ప్రామిసింగ్ రిపోర్ట్ లు సొంతం అవ్వగా ఇక రెగ్యులర్ షోలకు ఆడియన్స్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇక…