బాక్స్ ఆఫీస్ దగ్గర చప్పగా సాగుతున్న ఈ జూన్ నెలలో ఉన్నంతలో మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్లాస్ మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా ఈ వీకెండ్ లో..
ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ కాబోతూ ఉండగా ఆల్ ధనుష్ లాంటి స్టార్ హీరో చేస్తున్న బైలింగువల్ అవ్వడంతో తమిళ్ లో కూడా సినిమా మీద మంచి అంచనాలు ఉంటాయి అని అందరూ అనుకున్నారు. బిజినెస్ కూడా అక్కడ…
ఆల్ మోస్ట్ 19 కోట్ల రేంజ్ లో జరగగా అడ్వాన్స్ బుకింగ్స్ మంచి జోరుని చూపెడుతుంది అని అనుకుంటే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి 2 రోజులు కావోస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు అక్కడ 75 లక్షల రేంజ్ లోనే గ్రాస్ బుకింగ్స్ ను సినిమా…
సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 80 లక్షల రేంజ్ లో బుకింగ్స్ ను అందుకుంది, రెస్ట్ ఆఫ్ ఇండియా బుకింగ్స్ 15 లక్షల మార్క్ ని అందుకోగా టోటల్ గా ఇండియాలో 1.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకున్న సినిమా నార్త్ అమెరికాలో..
అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 120K డాలర్స్ మార్క్ ని దాటగా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు వరల్డ్ ఎయిడ్ గ్రాస్ బుకింగ్స్ 3 కోట్ల రేంజ్ లోనే ఉండగా సినిమా ఇంకా మంచి రచ్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మంచి పాజిటివ్ టాక్ సినిమాకి సొంతం అయ్యే..
అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తమిళ్ లో కూడా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. అనుకున్న రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు పెర్ఫార్మ్ చేయడం లేదు…ఇలాంటి టైంలో అంచనాలు పెట్టుకున్న కుబేర ఎలాంటి జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతుందో చూడాలి.