టాలీవుడ్ సమ్మర్ సీజన్ చాలానే చప్పగా సాగగా కొన్ని మంచి సినిమాలు పడినా కూడా ఎక్కువ శాతం నిరాశ కలిగించే రిజల్ట్ లు సొంతం అవ్వగా ఈ నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న బిగ్ మూవీ కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్లాస్ మూవీ కుబేరా(Kuberaa Movie) సినిమా…
ఈ నెల 20న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కంటెంట్ ఇదే రేంజ్ లో ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాసివ్ విజయాన్ని ఈ సినిమా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పాలి.
కథ పాయింట్ ని పెద్దగా ట్రైలర్ లో రివీల్ చేయకపోయినా కూడా డబ్బు లేని బెగ్గర్స్ ని వెతికి పట్టుకుని వాళ్ళ పేరుతో బిజినెస్ చేసే నాగార్జునకి బెగ్గర్ అయిన ధనుష్ దొరుకుతాడు…తనని వాడుకుంటున్నారు అని తెలిసిన ధనుష్ తర్వాత ఏం చేశాడు, తనని పట్టుకోవడానికి…
నాగార్జున ఏం చేశాడు అన్నది మొత్తం మీద సినిమా కోర్ పాయింట్ లా ట్రైలర్ చూస్తె తెలుస్తుంది… స్క్రీన్ ప్లే పరంగా లెంత్ ఎక్కువ అయినా కూడా ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వకుండా సినిమా మంచి ఫ్లో తో సాగుతుందని చెబుతూ ఉండగా… అందరి యాక్టింగ్ కూడా ట్రైలర్ వరకు అద్బుతంగా ఉందని చెప్పాలి.
ఎక్కడా ఎవ్వరూ తాము స్టార్స్ అనిపించేలా కాకుండా సామాన్య జనాలుగానే ట్రైలర్ లో కనిపించగా దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది. ఇక ట్రైలర్ ఉన్న రేంజ్ లోనే సినిమా కూడా ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమా…
సాలిడ్ విజయాన్ని దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంది, భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పుడు తెలుగు తో పాటు తమిళ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ టైంలో అక్కడ రిలీజ్ అయిన నోటబుల్ మూవీస్ నిరాశ పరచడంతో ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.