బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) కుబేర(Kuberaa Movie) సినిమా, రిలీజ్ ముందు రోజు వరకు పెద్దగా బుకింగ్స్ లో జోరు కనిపించలేదు. కానీ రిలీజ్ రోజున రీసెంట్ టైంలో బెస్ట్ రివ్యూలు టాక్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది…
దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో వీర విహారం చేసిన సినిమా ఇప్పుడు అసలు సిసలు టెస్ట్ లోకి ఎంటర్ కాబోతుంది. వర్కింగ్ డేస్ లో సినిమా ఇప్పుడు ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుంది అన్నది ఆసక్తి కరంగా మారింది. సినిమాకి వచ్చిన యునానిమస్ పాజిటివ్ టాక్ కి…
కలెక్షన్స్ పరంగా వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించాల్సి ఉంటుంది. నార్మల్ గా ఏ సినిమా అయినా కూడా హాలిడే తర్వాత వర్కింగ్ డే లో 60-70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి… మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలు…
50-60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి…ఈ లెక్కన కుబేర లాంటి సూపర్ డూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమాకి హాలిడే తో పోల్చితే వర్కింగ్ డే లో మినిమమ్ 50% రేంజ్ లో డ్రాప్స్ కనుక ఉండి… ఓవరాల్ గా…
4వ రోజున వసూళ్లు 10 కోట్లకు పైగా రేంజ్ లో కనుక వస్తే రిమార్కబుల్ హోల్డ్ ని సినిమా చూపించింది అని చెప్పొచ్చు… అదే కనుక జరిగితే సినిమాకి ఎక్స్ లెంట్ లాంగ్ రన్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రన్ ని కొనసాగిస్తుందో చూడాలి.