బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush)ల కాంబో మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా అన్ని చోట్లా సాధిస్తున్న కలెక్షన్స్…
ఒకెత్తు అయితే తెలుగు రాష్ట్రాల్లో చూపెడుతున్న జోరు మరో ఎత్తు అని చెప్పాలి ఇప్పుడు….ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపెడుతూ మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ ని ధనుష్ కెరీర్ లో అందుకున్న సినిమా రెండో రోజు మొదటి రోజు కి మించి రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించింది…
ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజుకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో జోరు చూపెడుతుంది అనుకుంటే సినిమా మూడో రోజు మరోసారి అంచనాలను అన్నీ కూడా మించి పోయి రెండో రోజుకి మించి కలెక్షన్స్ ని అందుకుంది. నైజాంలో రెండో రోజు మొత్తం మీద…
3.21 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా మూడో రోజు డ్రాప్ అవుతుంది అనుకున్నా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా ఏకంగా 3.35 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక రెండో రోజు 7.21 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుంటే…
మూడో రోజు అంచనాలను మించి పోయి 7.8 కోట్లకు పైగా షేర్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేసిన ఈ సినిమా మొదటి రోజుకి మించి రెండో రోజు, రెండో రోజు కి మించి ఇప్పుడు మూడో రోజు మాస్ రచ్చ చేసిందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపెడుతుందో చూడాలి.