Home న్యూస్ కుబేరా మూవీ స్టోరీ పాయింట్ లీక్…ఊరమాస్ రచ్చ ఖాయం!!

కుబేరా మూవీ స్టోరీ పాయింట్ లీక్…ఊరమాస్ రచ్చ ఖాయం!!

0

ఆడియన్స్ ముందుకు వచ్చే వారం భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్లాస్ మూవీ కుబేరా(Kuberaa Movie) సినిమా మీద అందరిలో మంచి అంచనాలు ఉండగా….

రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకోగా 3 గంటల రేంజ్ లో రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా కథ మెయిన్ పాయింట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది… ఓవరాల్ గా కథ పాయింట్ యూనిక్ లెవల్ లో ఇంప్రెస్ చేసేలా ఉందని చెప్పాలి…

కథ పాయింట్ ప్రకారం సినిమాలో నాగార్జున పెద్ద చార్టర్ అకౌంటెంట్ గా నటిస్తున్నారట. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని కొందరు రోడ్ సైడ్ ఉండే బెగ్గర్స్ పేరిట హవాలా చేయిస్తూ స్విస్ బ్యాంక్ కి అమౌంట్ ని సెండ్ చేయించి అక్కడ నుండి…

తన అకౌంట్ కి లీగల్ గా అమౌంట్ వచ్చేలా చేసుకుంటాడట…అంతా సాఫీగా సాగుతున్న టైంలో తన కన్నా తెలివైన ధనుష్ ఈ ప్రాసెస్ గురించి తెలుసుకుంటాడట…ఆ తర్వాత నువ్వా నేనా అన్నట్లు సాగే కథ ఎటు టర్న్ తీసుకుంది అన్నది మొత్తం మీద మిగిలిన కథ అని అంటున్నారు…

యూనిక్ పాయింట్ తో తెరకెక్కుతున్న కుబేరా మూవీని శేఖర్ కమ్ముల చాలా బాగా డీల్ చేశారని తెలుస్తుంది…లీడ్ యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ మేజర్ హైలెట్ గా నిలవబోతుందని, అలాగే అన్ని చోట్లా సినిమా కచ్చితంగా వర్కౌట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారట.

సెన్సార్ వాళ్ళ నుండి కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండగా…ఈ పాయింట్ అనుకున్న రేంజ్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించి ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here