జూన్ నెల చాలా చప్పగా సాగుతూ ఉండగా ఆడియన్స్ ను భారీ లెవల్ లో థియేటర్స్ కి రప్పించాల్సిన భాద్యత కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్లాస్ మూవీ కుబేరా(Kuberaa Movie) సినిమా మీద ఉండగా…
సినిమా మీద ఆల్ రెడీ మంచి బజ్ అయితే ఉందని చెప్పాలి. ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తూ ఉండటంతో ఏమాత్రం సినిమా అంచనాలను అందుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఇటు తెలుగు లో అటు తమిళ్ లో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉండగా…
మరో పక్క బిజినెస్ పరంగా కూడా మంచి జోరుని చూపెడుతున్న సినిమా మేజర్ ఏరియాల్లో సాలిడ్ రేటుని దక్కించుకుంటూ ఉంది. ఇక సినిమా ఇప్పుడు నైజాం ఏరియాలో ఓవరాల్ గా బిజినెస్ ను కంప్లీట్ చేసుకోగా ఇక్కడ సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్…
16 కోట్ల రేంజ్ లో సొంతం అయినట్లు సమాచారం. ఆల్ రెడీ ఆంధ్రలో 18 కోట్ల రేంజ్ లో సీడెడ్ లో 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా తమిళనాడులో కూడా 19 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇలా అన్ని మేజర్ ఏరియాల్లో కూడా…
ఎక్స్ లెంట్ బిజినెస్ ను కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కచ్చితంగా మంచి జోరు చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు టాలీవుడ్ కి కూడా ఓ మంచి హిట్ మూవీ అవసరం కాబట్టి ఈ సినిమా ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాలని అందరూ ఆశిస్తున్నారు…