Home న్యూస్ కుబేర టీసర్ రివ్యూ….శేఖర్ కమ్ముల క్లాస్ రచ్చ!

కుబేర టీసర్ రివ్యూ….శేఖర్ కమ్ముల క్లాస్ రచ్చ!

0

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్(Dhanush) ల కాంబోలో టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్లాస్ మూవీ కుబేర(Kuberaa Movie) మీద అంచనాలు భారీగానే ఉండగా వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు…

జూన్ 20న రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…కాగా టీసర్ చూసిన తర్వాత కంప్లీట్ గా శేఖర్ కమ్ముల క్లాస్ టచ్ తో మంచి రచ్చ చేసేలానే ఉందనిపించింది అని చెప్పాలి. కానీ పెద్దగా డైలాగ్స్ లాంటివి లేకుండా…

మెయిన్ క్యారెక్టర్స్ అన్నింటి పరిచయం చేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ టీసర్ లో మెయిన్ హైలెట్ గా నిలిచింది. టీసర్ మొత్తం బ్యాగ్రౌండ్ సాంగ్ అండ్ సౌండ్ తో నే సాగగా కథ గురించి కూడా పెద్దగా క్లూస్ కూడా ఏం ఇవ్వకుండా బాగా జాగ్రత్త తీసుకున్నట్లు అనిపించింది..

అది కొంచం క్లూ ఇచ్చి ఒకటి రెండు డైలాగ్స్ లాంటివి పెట్టి ఉంటే ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ఇంకా పెరిగి ఉండేది అని చెప్పొచ్చు. ఇక నాగార్జున మరియు ధనుష్ ల లుక్స్ ఆసక్తిని పెంచగా రష్మిక సీన్స్ ని కొద్ది వరకే టీసర్ లో చూపించారు….

అందరి లుక్స్ లోకి ధనుష్ లుక్స్ మాత్రం ఓ బిచ్చగాడి నుండి ఎలా ఒక కుబేరుడిగా మారాడు అన్న పాయింట్ తో ఉన్నట్లు అనిపించగా ఓవరాల్ గా టీసర్ మరీ అంచనాలను మించి పోయింది అని చెప్పలేం కానీ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో కొద్ది వరకు…

టీసర్ కట్ లో చెప్పే ప్రయత్నం చేశారు కానీ కథ గురించి అన్ని పాత్రల మధ్య ఉన్న లింక్ గురించి కొంచం చెప్పి ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా టీసర్ బాగానే ఉండగా ఇక 24 గంటల్లో టీసర్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here