Home న్యూస్ కుబేర థియేటర్స్…బుకింగ్స్….డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

కుబేర థియేటర్స్…బుకింగ్స్….డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

0

కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో రూపొందిన మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ కాబోతూ ఉండగా 65 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా…

700 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా తమిళనాడులో 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా నార్త్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా మరో 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఓవర్సీస్ లో సినిమా సుమారు 450 వరకు థియేటర్స్ లో…

రిలీజ్ కాబోతూ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 1700 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్క ఆంధ్రలో లేట్ గా ఓపెన్ అవ్వగా మిగిలిన చోట్ల 2 రోజుల ముందే బుకింగ్స్ ను ఓపెన్ చేయగా ఓవరాల్ గా బుకింగ్స్ ట్రెండ్ మాత్రం…

మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేదు అనే చెప్పాలి. తెలుగు తో పోల్చితే తమిళ్ లో బుకింగ్స్ కుమ్మేస్తుంది అనుకున్నా అక్కడ బుకింగ్స్ తెలుగులో కన్నా కూడా వీక్ గానే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ ట్రెండ్ ఉన్నప్పటికీ…

మరీ సినిమా రేంజ్ కి మించిపోవడం లేదు, కానీ సినిమాకి మంచి టాక్ కనుక సొంతం అయితే షో షో కి కలెక్షన్స్ పరంగా మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ప్రజెంట్ బుకింగ్స్ గ్రాస్ వరల్డ్ వైడ్ గా 6 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో ఉండగా…

ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 6-8 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా తమిళ్ లో 5 కోట్లు ఆ పైన వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది…. ఇక టాక్ ను బట్టి షో షో కి కలెక్షన్స్ లో….

జోరు చూపించే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా అన్నీ అనుకున్నట్లు జరిగితే 15-18 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు, సినిమా మీద ఉన్న అంచనాలను దృశ్యా 22-25 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక డే 1 సినిమా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here