కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) కుబేర(Kuberaa Movie) సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మొదటి రోజున అల్టిమేట్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా నాగార్జున, ధనుష్ మరియు శేఖర్ కమ్ముల కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది.
సినిమా మొదటి రోజు మాస్ రికార్డులు సృష్టించిన తర్వాత రెండో రోజులో అడుగు పెట్టగా టికెట్ సేల్స్ పరంగా మొదటి రోజు కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో రెండో రోజు ఓపెనింగ్స్ అన్ని చోట్లా ఉన్నాయి. తమిళనాడులో మాత్రం సినిమా సాలిడ్ గ్రోత్ ని చూపెడుతుంది అనుకున్నా…
ట్రెండ్ డే 1 కన్నా కొంచం తక్కువగానే ఉందని చెప్పాలి. కానీ అదే టైంలో సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్స్ లెంట్ ట్రెండ్ ను రెండో రోజున చూపెడుతూ ఉండగా ఎక్స్ ట్రా షోలు కూడా ఈ రోజు యాడ్ అవ్వగా ఆక్యుపెన్సీ ఎక్స్ లెంట్ గా ఉందని చెప్పాలి.
ఓవరాల్ గా ప్రజెంట్ ఓపెనింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అండ్ కొన్ని చోట్ల వర్షాలు ఇబ్బంది కలగకుండా…
ఉంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక తమిళనాడులో సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి ట్రెండ్ బాగుంటే మరో 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా..
సినిమా ఈ రోజున సాలిడ్ జోరుని చూపెడుతూ ఉంది. దాంతో రెండో రోజు ఎండ్ అయ్యే టైంకి సినిమా ఈ అంచనాలను కూడా మించిపోయే అవకాశం ఉంది కానీ దానికి తమిళ్ లో ట్రెండ్ ఇంకా బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక డే 2 ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుందో చూడాలి ఇప్పుడు.