Home న్యూస్ ఖుషి బుకింగ్స్ రిపోర్ట్….1st డే ఎంత రావొచ్చు అంటే!!

ఖుషి బుకింగ్స్ రిపోర్ట్….1st డే ఎంత రావొచ్చు అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ లైగర్(Liger Movie) తో ఫ్లాఫ్ ను సొంతం చేసుకున్నా కూడా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన కొత్త సినిమా ఖుషి(Kushi Movie 2023) మంచి అంచనాల నడుమ రిలీజ్ కానుంది.

సినిమా మీద ఆడియన్స్ లో డీసెంట్ అంచనాలు ఉండగా అవి మరీ లైగర్ రేంజ్ లో లేవు, అయినా కూడా సినిమా బుకింగ్స్ పరంగా మాత్రం మంచి జోరుని అన్ని చోట్లా చూపిస్తూ దూసుకు పోతూ ఉంది. ముఖ్యంగా క్లాస్ సెంటర్స్ లో సినిమా బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా…

తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఆల్ మోస్ట్ 5 కోట్లను టచ్ అవ్వగా టోటల్ గా ఇండియాలో 6 కోట్ల లోపు గ్రాస్ బుకింగ్స్ జరగడం విశేశం అని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్ ప్రీ సేల్స్ లెక్క ఆల్ మోస్ట్ 3 లక్షల మార్క్ ని చేరుకోగా ఓవరాల్ గా సినిమా అన్ని చోట్లా…

సాలిడ్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఆల్ మోస్ట్ బుకింగ్స్ లైగర్ కి దగ్గరగా ఉండే లెవల్ లో ఉన్నాయని చెప్పాలి. లైగర్ బుకింగ్స్ కొంచం బెటర్ గా మాస్ సెంటర్స్ లో ఉంది…

సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున 8-9 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా టాక్ ని బట్టి షో షోకి కలెక్షన్స్ పెరిగి పోతే ఈ కలెక్షన్స్ 10 కోట్ల మార్క్ ని దాటేసి ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here