బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోస్తూ రికార్డుల బెండు తీస్తున్న సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా, మొదటి వారంలో మలయాళ ఇండస్ట్రీ రికార్డులను అన్నీ కూడా…
బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది….కాగా మొదటి వారంలోనే సినిమా 230 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా… 8వ రోజున కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా కేరళ అలాగే ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది.
ఇక ఇప్పుడు 9వ రోజున సాధించే కలెక్షన్స్ తో సినిమా అఫీషియల్ గా మలయాళ సినిమాల పరంగా ఆల్ టైం ఎపిక్ ఇండస్ట్రీ హిట్ గా నిలవబోతుంది అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా టోటల్ రన్ లో…
ఊహకందని రేంజ్ లో 241.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పుడు 8 రోజుల్లో 240 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకున్న లూసిఫర్2 మూవీ ఇప్పుడు 9వ రోజున సాధించే కలెక్షన్స్ తో మలయాళ సినిమాల పరంగా…
ఆల్ టైం న్యూ ఇండస్ట్రీ హిట్ మూవీ గా నిలవబోతుంది. అలాగే మలయాళ సినిమాల పరంగా ఇప్పుడు ఫస్ట్ టైం 250 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోబోతున్న సినిమాగా నిలవనుంది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో మినిమమ్ హోల్డ్ చేసినా 300 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.