బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాలతో దుమ్ము లేపిన తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన మెకానిక్ రాకీ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు లైలా(Laila Movie)మూవీతో ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఈ సినిమాతో ఎంతవరకు అంచనాలను అందుకున్నాడు, ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకున్నాడో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే..పాతబస్తీలో మేకప్ ఆర్టిస్ట్ అయిన హీరో తన టాలెంట్ తో కొందరికీ హెల్ప్ చేస్తాడు, కానీ అనుకోకుండా కొన్ని తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కున్న తర్వాత ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి లేడీ గెటప్ వేయాల్సి వస్తుంది. అలా లేడీ గెటప్ వేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మిగిలిన కథ..
హీరో లేడీ గెటప్ వేస్తున్నాడు అంటే…ఆ గెటప్ వెనక కారణం ఎంత బలంగా ఉంటే ఆ గెటప్ కి అంత వర్త్ పెరుగుతుంది….కానీ లైలాలో డైరెక్టర్ ఈ గెటప్ వెనక చెప్పిన కారణం ఏమంత బలంగా లేక పోవడంతో ఆ గెటప్ కోసం విశ్వక్ సేన్ ఎంత కష్టపడినా కూడా ఆ కష్టం మొత్తం వృదా అయింది అనే చెప్పాలి…
సినిమాలో కొన్ని ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేదు సరికదా సహనానికి పరీక్ష గా నిలిచిన సీన్స్ చాలానే ఉన్నాయి సినిమాలో…ఫస్టాఫ్ ఎలాగోలా అయిన తర్వాత సెకెండ్ ఆఫ్ అయినా బాగుంటుంది అనుకున్నా కూడా..
సెకెండ్ ఆఫ్ కూడా ఏ దశలో అంచనాలను అందుకోలేక పోయింది…దాంతో సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసే పరిస్థితి చాలా సీన్స్ కలిగించాయి సినిమాలో…ఉన్నంతలో విశ్వక్ సేన్ తన రోల్ కోసం కష్టపడ్డాడు…డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పినా కూడా ఎంతో కొంత…
ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేశాడు కానీ కథలోనే బలం లేక పోవడంతో అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు…ఇక హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించుకున్నారు. సంగీతం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు…ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా ఎటు నుండి ఎటో వెల్లిపోయేలా ఉంది….
సినిమాటోగ్రఫీ బాగుండగా, ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపించాయి…ఇక డైరెక్టర్ ఎంచుకున్న హీరో లేడీ గెటప్ పాయింట్ సినిమాలో చాలా సిల్లీగా ఉండగా ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ కూడా అంతే సిల్లీగా ఉండటంతో ఏ దశలో కూడా లైలా మూవీ డీసెంట్ అనిపించేలా కూడా మెప్పించ లేక పోయింది….
ఫస్టాఫ్ సెకెండ్ ఆఫ్ అని తేడా లేకుండా కంప్లీట్ మూవీ మొత్తం కొన్ని సీన్స్ మినహా ఏ దశలో కూడా మెప్పించ లేక పోయింది…ఎంత లో ఎక్స్ పెర్టేషన్స్ తో వెళ్ళినా కూడా సినిమా అయ్యే సరికి యావరేజ్ అనిపించడం కూడా కొద్దిగా కష్టమే అని చెప్పాలి. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 1.75 స్టార్స్….