బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) టించిన లేటెస్ట్ మూవీ లైలా(Laila Movie) గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ లో డీసెంట్ బజ్ ను అయితే సినిమా సొంతం చేసుకుంది అని చెప్పాలి… ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 8.2 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా…
9 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 650 వరకు థియేటర్స్ లో ఈ వీకెండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది….ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్…
రెండు రోజుల ముందు నుండే స్టార్ట్ అవ్వగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా ఏమి ఇంపాక్ట్ ను అయితే చూపించ లేదు అనే చెప్పాలి…విశ్వక్ సేన్ రీసెంట్ మూవీస్ లో దాస్ క ధమ్కి, గామి మరియు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాల బుకింగ్స్ సాలిడ్ గా ఉండగా…
వాటి తర్వాత వచ్చిన మెకానిక్ రాకీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒకింత నిరాశ పరిచింది. సినిమా రిజల్ట్ కూడా నిరాశ పరిచే విధంగానే రాగా ఇప్పుడు లైలా సినిమా బుకింగ్స్ పరంగా ప్రస్తుతానికి మెకానిక్ రాకీ కన్నా తక్కువ బుకింగ్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి…దాంతో చాలా వరకు…
మౌత్ టాక్ నే నమ్ముకుని ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా, టాక్ బాగుంటే సినిమా షో షోకి కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ ను అయితే చూపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ చూస్తూ ఉంటే సినిమా కోటి రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది…
అది కూడా టాక్ డీసెంట్ గా ఉంటే సాధ్యం అని చెప్పాలి. ఇక సూపర్ పాజిటివ్ టాక్ ను కనుక సినిమా సొంతం చేసుకుంటే షో షో కి కలెక్షన్స్ పరంగా గ్రోత్ ని చూపించే అవకాశం ఉంటుంది. మరి హాట్రిక్ హిట్స్ తర్వాత ఒక ఫ్లాఫ్ తో స్లో అయిన విశ్వక్ సేన్ ఈ సినిమా తో ఇప్పుడు ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.