బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ మూడు మంచి సినిమాలతో డీసెంట్ మార్కెట్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో తనకి వచ్చిన డీసెంట్ మార్కెట్ ని దెబ్బ తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు మెకానిక్ రాకీతో వచ్చి పెద్దగా అంచనాలను అందుకోలేక పోయిన విశ్వక్ సేన్ లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు…
తన కొత్త మూవీ లైలా తో రాగా మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా తిరిగి తేరుకోలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల వీకెండ్ లో ఈ సినిమా కేవలం 1.6 కోట్ల రేంజ్ లోనే షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది…
బడ్జెట్ పరంగా చూసుకుంటే సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ తీవ్రంగా నిరాశ పరిచే విధంగా ఉన్నాయని చెప్పాలి. ఓవరాల్ గా 12.5 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో సినిమా నిర్మాణం అండ్ ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు అయ్యాయని ట్రేడ్ లో సమాచారం… కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లోనే…
మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించ లేక పోయింది. ఇక 4వ రోజున వర్కింగ్ డే లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుని మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించ లేక పోయిన లైలా మూవీ 4వ రోజున ఓవరాల్ గా 10 లక్షల రేంజ్ లో కూడా షేర్ ని అందుకోలేక పోయిందని సమాచారం..
అటు ఓవర్సీస్ లో కూడా భారీ గా డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచిన సినిమా ఓవరాల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 1.72 కోట్ల రేంజ్ లో షేర్ ని 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా భారీ డిసాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా బడ్జెట్ పరంగా బిజినెస్ పరంగా ఇప్పుడు తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుందని చెప్పాలి.