Home న్యూస్ లక్ష్మీ నరసింహా రీ రిలీజ్ రిజల్ట్….ఇది ఎవ్వరూ ఊహించలేదు!!

లక్ష్మీ నరసింహా రీ రిలీజ్ రిజల్ట్….ఇది ఎవ్వరూ ఊహించలేదు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా మళ్ళీ రీ రిలీజ్ ల ట్రెండ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటూ ఉండగా, కొత్త సినిమాలు నిరాశ పరుస్తున్న వేల ఆడియన్స్ ను రీ రిలీజ్ లే తిరిగ థియేటర్స్ కి రప్పిస్తున్నాయి…రీసెంట్ గా నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన సూపర్ హిట్ మూవీ లక్ష్మీ నరసింహా(LakshmiNarasimha4K)…

బాలయ్య పుట్టిన రోజు కానుకగా ఉన్నంతలో బాగానే రీ రిలీజ్ అయింది, దాంతో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో మాస్ రచ్చ చేస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే విషయంలో సినిమా తీవ్రంగా విఫలం అయ్యింది అని చెప్పాలి…

నార్త్ అమెరికాలో ఓవరాల్ గా 3 వేల డాలర్స్ ను కూడా అందుకోలేక పోయిన ఈ సినిమా ప్రింట్ ఖర్చులను కూడా అక్కడ రికవరీ చేయలేక పోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ షోలే పడగా జనాలు లేక కొన్ని చోట్ల ఆ షోలు కూడా ఆగిపోయాయి…

ఆంధ్ర సీడెడ్ లలో కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ బాగున్నా మేజర్ సిటీలలో మాత్రం మినిమమ్ జనాలు లేక ఎదురుదెబ్బ పడిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది అనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ఇండియాలో రీ రిలీజ్ లో 12-15 లక్షల రేంజ్ లోనే…

గ్రాస్ మార్క్ ని అందుకోగా థియేటర్స్ రెంట్స్ లాంటివి తీసేస్తే ఏమి మిగలలేదు అనే చెప్పాలి ఓవరాల్ గా… నార్మల్ టైంలో రీ రిలీజ్ లో ఫ్లాఫ్ అయిన మూవీస్ ఉన్నాయి కానీ టాప్ హీరోల పుట్టిన రోజు టైంలో రీ రిలీజ్ అయ్యి ఇలా ఫ్లాఫ్ అయిన సినిమా ఇదేనని చెప్పాలి… 

మినిమమ్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నా కూడా ఈ రేంజ్ లో ఎదురుదెబ్బ పడటం మాత్రం ఈ సినిమాకే చెల్లింది అని చెప్పాలి రీసెంట్ టైంలో. ఇక బాలయ్య నటిస్తున్న కొత్త సినిమా అఖండ2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ లో ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here