టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ లో అనుకున్న రేంజ్ లో సినిమాలు రిలీజ్ అవ్వక పోవడంతో ఎంతో కొంత రీ రిలీజ్ సినిమాలే ఆడియన్స్ ను పర్వాలేదు అనిపించే రేంజ్ లో థియేటర్స్ కి రప్పించాయి…రీసెంట్ గా వర్షం ఖలేజా లాంటి సినిమాలు రీ రిలీజ్ లో దుమ్ము లేపిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)…
నటించిన సూపర్ హిట్ మూవీ లక్ష్మీ నరసింహా(LakshmiNarasimha4K) ను రీసెంట్ గా రీ రిలీజ్ చేశారు…మరీ భారీగా ఏమి రీ రిలీజ్ చేయలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో మెయిన్ సెంటర్స్ లో సినిమాను రీ రిలీజ్ చేయగా…
ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నారు కానీ మరీ మేకర్స్ ఆశించిన రేంజ్ లో అయితే ఆడియన్స్ నుండి రెస్పాన్స్ రాలేదు, నైజాంలో చాలా సెంటర్స్ లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు, వైజాగ్ సీడెడ్ లాంటి ఏరియాల్లో పర్వాలేదు అనిపించేలా…
షోలకు ఆక్యుపెన్సీ సొంతం అవ్వగా మొదటి రోజు ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా కి 10-12 లక్షల రేంజ్ లోనే వసూళ్లు సొంతం అయ్యి ఉంటాయని అంచనా…రీసెంట్ రీ రిలీజ్ లతో పోల్చితే ఈ వసూళ్లు చాలా తక్కువే అని చెప్పాలి కానీ…
పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకి మొత్తం మీద పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. వీకెండ్ మొత్తం థియేటర్స్ లో ఉండబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా వీకెండ్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది.