Home న్యూస్ బయోపిక్ కి వర్మ షాక్…ఓవర్సీస్ లో సాలిడ్ దెబ్బ

బయోపిక్ కి వర్మ షాక్…ఓవర్సీస్ లో సాలిడ్ దెబ్బ

515
0

     స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆదరంగా ఈ ఇయర్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో కలుపుకుని మూడు సినిమాలు వచ్చాయి, ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి హాలిడేస్ వలన ఎంతో కొంత కలెక్షన్స్ ని అయినా సాధించింది కానీ రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడి తెలుగు సినిమా చరిత్ర లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ సినిమా లలో ఒకటిగా చేరింది.

ఇక సినిమా ఓపెనింగ్స్ విషయం లో కూడా భారీ స్టార్ కాస్ట్ ఏమాత్రం హెల్ప్ కాలేదు, ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు అలాగే మొదటి రోజు కలెక్షన్స్ ని కలుపుకుని కేవలం 1 లక్షా 42 వేల డాలర్స్ ని మాత్రమె ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా అమెరికా లో సాధించింది.

అదే సమయం లో అనేక అవరోధాలను ఎదురుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రీమియర్ షోలు అలాగే మొదటి రోజు కలెక్షన్స్ తో కలుపుకుని ఓవర్సీస్ లో ఏకంగా 1 లక్షా 55 వేల డాలర్స్ దాకా వసూళ్ళ ని సాధించి భారీ స్టార్ కాస్ట్ ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కి భారీ షాక్ నే ఇచ్చింది.

ఇక హైదరాబాదు లోని RTC X రోడ్స్ లో కూడా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా కానీ ఏకంగా సంక్రాంతి కి రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ కన్నా కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ కలెక్షన్స్ ఎక్కువ గా రావడం మరింత షాక్ ఇచ్చింది.

ఎన్టీఆర్ కథానాయకుడు 6 లక్షల 28 వేలు వసూల్ చేయగా, ఎన్టీఆర్ మహానాయకుడు 1 లక్షా 60 వేలు వసూల్ చేసింది, ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏకంగా 6 లక్షల 42 వేల గ్రాస్ ని వసూల్ చేసి షాక్ ఇచ్చింది, ఇలా మొదటి రోజు వసూళ్ళ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ బయోపిక్ కి భారీ షాక్ నే ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here