పోల్:- లక్ష్మీస్ ఎన్టీఆర్ Vs ఎన్టీఆర్ మహానాయకుడు(ఏ ట్రైలర్ బాగుంది?)

1
561

   రీసెంట్ టైం లో రామ్ గోపాల్ వర్మ మూవీస్ లో భారీ హైప్ ని సొంతం చేసుకున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ట్రైలర్ తోనే సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా బాలకృష్ణ చేస్తున్న సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ కి పోటి గా అసలు కథ ఇందులో ఉంది అంటూ చేసిన కామెంట్స్ తో సినిమా పై హైప్ భారీ గా పెరిగి పోగా ట్రైలర్ తో అందరి లోను మరింత క్రేజ్ పెరిగి పోయింది అని చెప్పొచ్చు.

ఇక రీసెంట్ గా బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది, దాంతో రెండు ట్రైలర్ ల మధ్య కాంపిటీషన్ మొదలు అయ్యింది, లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 24 గంటల్లో ఏకంగా 4.6 మిలియన్ వ్యూస్ ని అందుకుంది.

ఇక ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ కి 2 మిలియన్ కి పైగా రియల్ టైం వ్యూస్ ఇప్పటికే వచ్చిన ఇంపాక్ట్ మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పోల్చితే చాలా చప్పగానే ఉందని చెప్పొచ్చు. బయట ఎన్టీఆర్ జీవితం పై అనేక కథనాలు అందరికీ సుపరిచితమే అవ్వడంతో ట్రైలర్ లో మాత్రం…

చాలా కొన్ని విషయాలను మాత్రమె చూపెట్టి ఇదే నిజం అనే విధంగా చెప్పే విధంగా ఎన్టీఆర్ మహానాయకుడు ఉందని చాలా కామెంట్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో పాటే ఎన్టీఆర్ మహానాయకుడు తో పోల్చితే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కొంచం నిజాలు ఉన్నాయని పిస్తుందని అంటున్నారు.

దాంతో మీరు ఇప్పటికే రెండు ట్రైలర్స్ ని ఎలాగు చూసి ఉంటారు కాబట్టి ఈ రెండు ట్రైలర్స్ లో బెస్ట్ ట్రైలర్ ఏది అని మీకు అనిపించిందో, ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ నిజాలు ఎందులో చూపెట్టారు అని మీకు అనిపించిందో కింద పోల్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!