సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) స్పెషల్ క్యామియోలో రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salaam Movie Telugu Review) ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
స్టొరీ పాయింట్ కి వస్తే ఊర్లో స్నేహితులు అయిన ఇద్దరు కొన్ని కారణాల వలన విడిపోవాల్సి రాగా ఆ ఊరితో లింక్ ఉన్న ముంబై వ్యాపారి అయిన రజినీకాంత్ ఆ ఊరికి వచ్చిన ఓ పెద్ద సమస్యని ఎలా సాల్వ్ చేసే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా ఓవరాల్ గా స్టొరీ పాయింట్….
చాలా చాలా బేసిక్ స్టొరీ పాయింట్ తో వచ్చిన లాల్ సలామ్ మూవీ చాలా నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లేతో నిరాశ పరిచింది, అక్కడక్కడా కొందరి పెర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించినా కూడా ఏ దశలో కూడా సినిమా ఆకట్టుకునేలా తీర్చలేకపోయారు…రజినీకాంత్ రోల్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించగా….
విష్ణు విశాల్ రోల్ పర్వాలేదు అనిపించగా విక్రాంత్ కూడా ఓకే అనిపించాడు. మిగిలిన యాక్టర్స్ అందరూ ఉన్నంతలో తమ రోల్స్ తో ఓకే అనిపించగా , సంగీతం సోసోగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ని కలిగించలేదు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ బోరింగ్ గా ఉండగా ఏ దశలో కూడా సినిమా ఆకట్టుకోలేదు…
సినిమాటోగ్రఫీ రిచ్ గానే ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకోగా, డైరెక్షన్ పరంగా ఐశ్వర్య రజనీకాంత్ పరమ రొటీన్ స్టొరీతో ఏ దశలో కూడా మెప్పించలేకపోయింది. రజినీది ఎక్స్ టెండెడ్ క్యామియోనే అయినా కూడా ఆ రోల్ కి కూడా పూర్తి న్యాయం చేయలేదు, ఓవరాల్ గా చాలా చోట్ల బోర్ కలిగించిన లాల్ సలామ్ మూవీ చూడాలి అంటే చాలా చాలా ఓపిక అవసరం….
అంత ఓపిక పట్టి చూస్తె మొత్తం మీద సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఎన్ని ఉన్నా కూడా అతి కష్టం మీద ఒక సారి చూడటం కూడా కష్టంగానే అనిపించింది అని చెప్పొచ్చు…. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్….