Home న్యూస్ 2010-2019 టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎక్కువ హిట్స్ ఎవరివో తెలుసా?

2010-2019 టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎక్కువ హిట్స్ ఎవరివో తెలుసా?

4997
0

       మరో దశాబ్దం ముగిసింది, కొత్త దశాబ్దం లోకి అడుగు పెట్టడానికి సిద్ధం అవుతున్నాం… టాలీవుడ్ లో స్టార్ హీరోల విషయం లో గత 10 ఏళ్లలో పెద్దగా మార్పులు లేవు. ఉన్నంతలో టైం మారుతూ ఒక్కో సమయం లో ఒక్కో హీరో డామినేట్ చేస్తూ వస్తున్నారు. ఓవరాల్ గా ఈ గడచిన 10 ఏళ్లలో టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఎవరు ఎక్కువ హిట్స్ ని సొంతం చేసుకున్నారో తెలుసుకుందాం పదండీ… సీనియర్ హీరోలు మరియు టైర్ 2 హీరోల లిస్టు త్వరలో అప్ డేట్ చేస్తాం.

పవన్ కళ్యాణ్:
ఈ 10 ఇయర్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు 10 అందులో హిట్ అయిన సినిమాలు మాత్రం 2… ఒకటి గబ్బర్ సింగ్ మరోటి అత్తారింటికి దారేది… కెమరామెన్ గంగతో రాంబాబు, గోపాల గోపాల సినిమాలు యావరేజ్ గా నిలవగా మిగిలిన సినిమాలు ఫ్లాఫ్స్ గా నిలిచాయి.

అల్లుఅర్జున్:
అల్లుఅర్జున్ 10 ఇయర్స్ లో 11 సినిమాల్లో నటించగా… అందులో జులాయి, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలు హిట్స్ గా నిలిచాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. మిగిలిన సినిమాల్లో బద్రీనాథ్, రుద్రమదేవి DJ సినిమాలు యావరేజ్ గా నిలిచాయి.. మిగిలిన సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి.

రామ్ చరణ్:
రామ్ చరణ్ 10 ఏళ్లలో 10 సినిమాలు చేయగా అందులో రచ్చ, నాయక్, ఎవడు, ధృవ మరియు రంగస్థలం సినిమాలు హిట్స్ అవ్వగా…గోవిందుడు అందరివాడేలే ఎబో యావరేజ్ అయింది. మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా నిలిచాయి. 2000 దశకం ఎండింగ్ లో మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టగా 2018 రంగస్థలంతో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రామ్ చరణ్.

ప్రభాస్:
రెబల్ స్టార్ ప్రభాస్ 10 ఏళ్లలో చేసిన సినిమాలు 7 కాగా అందులో 5 హిట్స్ ఉన్నాయి… డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి 1 మరియు బాహుబలి 2 లు హిట్స్ అవ్వగా సాహో యావరేజ్ గా నిలవగా రెబల్ ఒక్కటే ఫ్లాఫ్ అయింది. ఈ 10 ఇయర్స్ లో ఎవ్వరి ఊహకలకు అందని రికార్డుల రారాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి.

మహేష్ బాబు:
ఈ 10 ఇయర్స్ లో మహేష్ బాబు మొత్తం మీద 11 సినిమాలు చేయగా అందులో 6 హిట్స్ గా నిలిచాయి..దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను మరియు మహర్షి సినిమాలు హిట్స్ అవ్వగా మిగిలిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాఫ్స్ అయ్యాయి..

ఎన్టీఆర్:
ఈ 10 ఇయర్స్ లో ఎన్టీఆర్ ఏకంగా 13 సినిమాలు చేయగా అందులో 7 క్లీన్ హిట్స్ ఉన్నాయి… అదుర్స్, బృందావనం, బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ మరియు అరవింద సమేతలు క్లీన్ హిట్ అవ్వగా.. దమ్ము సినిమా సెమీ హిట్ గా, జై లవ కుశ ఎబో యావరేజ్ గా నిలిచాయి. మిగిలిన సినిమాలు ఫ్లాఫ్స్ గా నిలిచాయి.

ఇవీ మొత్తం మీద ఈ దశాబ్దంలో మన స్టార్ హీరోల పెర్ఫార్మెన్స్… హిట్స్ వరకు చూసుకుంటే ఎన్టీఆర్ టాప్ లో ఉండగా ఆల్ టైం రికార్డ్స్ పరంగా తక్కువ సినిమాల్లో ఎక్కువ రికార్డ్స్ తో ప్రభాస్ టాప్ లో ఉంటాడు. ఇక న్యూ ఇయర్ నుండి మన హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తూ అందులో ఎక్కువ శాతం హిట్స్ ఉండాలని కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here