ఒకప్పుడు సినిమాల విజయాలను ఆ సినిమాలు ఎన్ని రోజులు ఆడాయి అన్న దాని మీద చెప్పే వాళ్ళు, హిట్ కి ఫ్లాఫ్ కి తేడా లేకుండా చాలా సినిమాలు 100 రోజులు ఆడేవి, సూపర్ హిట్ అయితే 150 నుండి 175 రోజులు, బ్లాక్ బస్టర్ అయితే 200 నుండి 250 రోజులు… అంతకు మించి సినిమా ఉంటే ఆ సినిమాలు 300 రోజులు 365 రోజులు ఇలా ఆడుతూ ఉండేవి… కానీ కాలం మారింది సినిమాలు ఆడే రోజులు తగ్గిపోయాయి.
ఇప్పుడు సినిమాలు రిలీజ్ అయిన వారాల లోపే పరుగు ముగియడం ఏవో కొన్ని సినిమాలు మాత్రమే 50 రోజులు ఆడటం లాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇక 100 రోజులు ఆడిన సినిమాలు గత 5-6 ఏళ్లలో వేళ్ళ మీదే లెక్క పెట్టుకోవచ్చు. బాహుబలి లాంటి సినిమాలు కూడా 50 రోజులు…
భారీగా ఉన్నప్పటికీ 100 రోజుల విషయం లో డౌన్ అయిన టైం లో ఇండియా లో ఒక సినిమా మాత్రం థియేటర్స్ లో వీర విహారం చేసింది. ఆది కూడా పరాయి గడ్డ మీద… ఆ సినిమానే మలయాళంలో రూపొందిన ప్రేమమ్ సినిమా. ఈ సినిమా సాధించిన విజయం గురించి అందరికీ తెలిసే ఉంటుంది…
2015 లో ఇదే టైం లో రిలీజ్ అయిన ఈ సినిమా మలయాళంలో రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కేరళలో 37 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా 61 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి ఊహకందని విజయాన్ని నమోదు చేయగా తమిళనాడు లో ఈ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ మరో లెవల్ అనే చెప్పాలి. సినిమా ఇక్కడ ఏకంగా…
300 రోజులు ప్రదర్శితం అయ్యి రికార్డ్ కొట్టింది. 300 వ రోజు సినిమా షో కి హౌస్ ఫుల్ బోర్డులు పడటం కూడా విశేషం. బహుశా ఇండియా లో చివరి 300 రోజులు పూర్తీ చేసుకున్న సినిమా ఇదొక్కటే అని చెప్పాలి. ఇలాంటి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు పూర్తీ అవ్వడం విశేషం…