బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి భారీ పాన్ ఇండియా మూవీస్ తో ఆల్ ఇండియా బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సింది, ఆ పోటి లో రెండు తెలుగు రాష్ట్రాలలో నాగార్జున నాగ చైతన్య ల కాంబినేషన్ లో వస్తున్న బంగార్రాజు సినిమా కూడా పోటిలో దుమ్ము లేపడం ఖాయమని ముందే కన్ఫాం అయినా డేట్ విషయంలో కొంచం ఆలస్యం చేశారు, కానీ రీసెంట్ గా పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా…
పోస్ట్ పోన్ అవ్వడంతో ఇక బంగార్రాజు ఒక్కటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్న సినిమాగా నిలవగా ట్రేడ్ లో ఆడియన్స్ లో ఇప్పుడు అందరి కళ్ళు ఈ సినిమా మీదే ఉన్నాయి అని చెప్పాలి. దాంతో ఎప్పుడెప్పుడు బాక్స్ ఆఫీస్ బరిలో…
ఈ సినిమా దిగుతుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా కి అన్ని ఏరియాలలో బిజినెస్ కూడా ఊరమాస్ అనిపించే లెవల్ లో జరగగా ఇటు నాగ చైతన్య కెరీర్ లో అటు నాగార్జున కెరీర్ లో ఈ బిజినెస్ ఆల్ టైం హైయెస్ట్ అనిపించే లెవల్ లో జోరుగా సాగుతూ ఉండగా…..
ఇప్పుడు రిలీజ్ కి కొన్ని రోజులే టైం ఉన్న టైం లో సడెన్ గా ఆంధ్ర ప్రదేశ్ లో సినిమాకి సాలిడ్ ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది, అసలే లో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు లాంటివి కూడా లేవు, ఇప్పుడు వాటికి తోడుగా పెరుగుతున్న 3rd వేవ్ కేసుల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ రాత్రి 11 నుండి ఉదయం 5 వరకు అలాగే…
థియేటర్స్ లో 50% ఆక్యుపెన్సీని పెట్టాలని ప్రభుత్వం సడెన్ నిర్ణయం తీసుకుంది, దాంతో ఈ సంక్రాంతికి బంగార్రాజు మాస్ జాతర ఖాయం అనుకుంటే ఇప్పుడు ఈ సడెన్ దెబ్బతో బిజినెస్ కూడా ఆంధ్రలో తగ్గే అవకాశం కనిపిస్తుంది… మరి ఈ అవరోధాన్ని కూడా దాటుకుని బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక.