Home గాసిప్స్ లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ కొట్టినా…ఇంకా హీరో దొరకలేదు!!

లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ కొట్టినా…ఇంకా హీరో దొరకలేదు!!

421
0

కొన్ని కొన్ని సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ విజయాలు దొరికినా కానీ తర్వాత సినిమా సెట్ అవ్వడానికి కొద్దిగా సమయం ఎక్కువ పడుతుంది, ప్రస్తుతం ఇదే ఫేస్ లో ఉన్నాడు రీసెంట్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ మారుతి. టాలీవుడ్ కి ఈరోజుల్లో అండ్ బస్టాప్ లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ వెంటనే ఆ ముద్ర నుండి బయటికి రావడానికి ప్రేమ కథా చిత్రం,

బాబు బంగారం, భలే భలే మోగాడివోయ్ లాంటి సినిమాలతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు, ఇక మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకోగా లాస్ట్ ఇయర్ చేసిన ప్రతీరోజూ పండగే సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ కొట్టాడు.

పర్వాలేదు బాగుంది అన్న టాక్ తోనే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇటు మారుతి కెరీర్ లో అటు సాయి ధరం తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయినా కానీ మళ్ళీ ఇప్పటి వరకు తన కొత్త సినిమా ను మొదలు పెట్టడం కాదు కదా…

కమిట్ కూడా కాలేదు డైరెక్టర్ మారుతి… రామ్ తో ఒక కథా చర్చలు జరిగినప్పటికీ అది సెట్ అవ్వలేదు, ఇక మిగిలిన హీరోల్లో చాలా వరకు ఒకటికి రెండు మూడు సినిమా లు కమిట్ అయ్యి ఉండటం తో మారుతి తన అప్ కమింగ్ మూవీ ని ఇంకా కన్ఫాం చేయలేదు, పైగా లాక్ డౌన్ ఎఫెక్ట్ కూడా కొట్టడం తో…

డిలే మరీ ఎక్కువ అవుతుండటం అందరు హీరోల సినిమాలు డిలే అవ్వడం తో ఈ ఏడాది ఎవ్వరూ కొత్త సినిమాలు కమిట్ అయ్యేలా లేరనే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది, దాంతో మారుతి అప్ కమింగ్ మూవీ ఈ ఇయర్ లో మొదలు అయ్యే అవకాశం తక్కువే అంటున్నారు.మరి ఎం జరుగుతుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here