అక్షయ్ కుమార్ కియరా అద్వాని ల కాంబినేషన్ లో రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే, కాగా సినిమా పై అంచనాలు ఎలా ఉన్నాయో విమర్శలు గొడవలు కూడా రిలీజ్ కి ముందు నుండే అదే విధంగా ఉండగా సినిమా రిలీజ్ అయిన తర్వాత నార్త్ ఆడియన్స్ అందరూ కూడా…
సినిమా ఏమాత్రం బాలేదని నెగటివ్ రివ్యూ లతో రెచ్చిపోయారు… సౌత్ మూవీ లవర్స్ మాత్రం ఒరిజినల్ తో పోల్చితే అంత బాలేదు కానీ ఉన్నంతలో బానే ఉంది అంటున్నారు, ఇక మొదటి రోజుకి గాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేసిందని…
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం విమర్శలకు దారితీయగా…. ట్రేడ్ వర్గాలు సినిమా ఫ్రీ అండ్ సబ్ స్క్రిప్షన్ రెండూ కలిపి కాదని కేవలం సబ్ స్క్రిప్షన్ ఉన్న కౌంట్ తో హైయెస్ట్ వ్యూస్ ని అందుకుందని అనుకుంటూ ఉండగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరో షాక్ ఇచ్చింది.
అలా కాదని సినిమా కి సబ్ స్క్రిప్షన్ తోనే హైయెస్ట్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ దక్కాయని కన్ఫాం చేసింది, అంటే రీసెంట్ టైం లో సుశాంత్ లాస్ట్ మూవీ దిల్ బేచారా అందరికీ ఫ్రీ గా చూసేలా చేయగా మొదటి రోజు ఆల్ మోస్ట్ 90 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కాయని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు లక్ష్మీ సినిమా…
సబ్ స్క్రిప్షన్ తోనే ఏకంగా 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని మొదటి రోజు సొంతం చేసుకుందని బయటికి లీక్ చేశారు అంటున్నారు. ఇది నిజంగానే షాకింగ్ అని చెప్పాలి, IPL ఎండ్ టైం కాబట్టి అందరూ యూసర్స్ యాక్టివ్ గా ఉండటం వలన ఈ రేంజ్ వ్యూస్ వచ్చాయని వాళ్ళు అంటున్నారట. ఇది నిజం అయితే మట్టుకు ఇదే ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి.