దసరా వీకెండ్ లో భాగంగా రీసెంట్ గా ఒకే రోజున 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఒకటి కోలివుడ్ తరుపున రీసెంట్ టైంలో మోస్ట్ హైప్ ఉన్న మూవీ అయిన దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లియో(LEO Movie) కాగా మరోటి టాలీవుడ్ బిగ్ రిలీజ్ అయిన నట సింహం బాలయ్య(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా…
రెండు సినిమా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత రెస్పాన్స్ సిమిలర్ గా రాగా ఇక్కడ రెగ్యులర్ షోలకు వచ్చే సరికి బాలయ్య భగవంత్ కేసరి కి టాక్ ఇంప్రూవ్ అయింది, ఇక ఈవినింగ్ షోల టైంకి రెగ్యులర్ ఆడియన్స్ నుండి ఏ సినిమాకి ఎలాంటి టాక్ సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా…
విజయ్ లియో మూవీ విషయానికి వస్తే…కథ పెద్దగా ఏమి లేక పోయినా కూడా యాక్షన్ సీన్స్ తోనే నిండిపోయిన సినిమా LCU టచ్ పర్వాలేదు అనిపించేలా ఉండటంతో ఫ్యాన్స్ కి LCU ఫ్యాన్స్ కి పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ వచ్చినా కూడా నార్మల్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మాత్రం యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ ఎక్కువగా వినిపిస్తుంది.
ఇక బాలయ్య భగవంత్ కేసరి కామన్ ఆడియన్స్ నుండి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో టాక్ వినిపిస్తూ ఉండగా ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమాలో చూపించిన వుమన్ ఎంపావర్మేంట్ సీన్స్ అండ్ సెంటిమెంట్ సీన్స్ బాగానే కనెక్ట్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తుంది, కామన్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ నుండి కూడా…
మొత్తం మీద ఎబో యావరేజ్ లెవల్ లో రెస్పాన్స్ వినిపిస్తూ ఉండగా ఫైనల్ గా సినిమాకి ఎబో యావరేజ్ టు హిట్ కి మధ్యలో రెస్పాన్స్ వినిపిస్తుంది ఇప్పుడు. ఓవరాల్ గా డే ఎండ్ అయ్యే టైం బాలయ్య భగవంత్ కేసరి బెటర్ టాక్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది ఇప్పుడు…
దాంతో లియో మూవీ యాక్షన్ లవర్స్ కోసం భగవంత్ కేసరి ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఇక కలెక్షన్స్ పరంగా ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాయో చూడాలి ఇక…