కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మోస్ట్ హైపుడ్ మూవీ అయిన లియో(LEO Movie) మూవీ భారీ లెవల్ లో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే విలన్స్ ఒక వ్యక్తి అనుకుని హీరో వెంట పడతారు, హీరో ఫ్లాష్ బ్యాక్ కి వాళ్ళకి లింక్ ఉంటుంది, హీరో ఆ వ్యక్తి నేను కాదు అని చెప్పినా వినరు, మరి ఇంతకీ విలన్స్ వెతుకున్న వ్యక్తి హీరోనేనా కాదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాను చాలా తిన్ స్టోరీ లైన్ తో తెరకెక్కించాడు.
సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల ఎపిసోడ్ బాగానే మెప్పించినా తర్వాత కథ మొత్తం ప్రీ ఇంటర్వెల్ వరకు చాలా నెమ్మదిగా సాగుతుంది, ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ నుండి మళ్ళీ యాక్షన్ సీన్స్ తో రచ్చ చేయగా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎక్స్ లెంట్ గా వర్కౌట్ అయింది, ఇక సెకెండ్ ఆఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పర్వాలేదు అనిపించగా తర్వాత కంప్లీట్ గా యాక్షన్ సీన్స్ తో…
నిండిపోయిన లియో మూవీ యాక్షన్ ని ఎక్కువగా ఇష్టపడే ఆడియన్స్ ను బాగా మెప్పిస్తుంది అని చెప్పొచ్చు. విజయ్ మరోసారి తన హీరోయిజంతో మాస్ ఎలివేషన్స్ తో కుమ్మేశాడు… త్రిష(Trisha) రోల్ పెద్దగా ఇంపాక్ట్ ఏమి లేదు…ఇక సంజయ్ దత్, అర్జున్ ల రోల్స్ బాగుండగా గౌతమ్ మీనన్ రోల్ కూడా మెప్పిస్తుంది . ఇక అనిరుద్ అందించిన సాంగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉండగా…
హీరోయిజం ఎలివేట్ సీన్స్ కానీ కొన్ని సీన్స్ కి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ చాలా స్లో గా సాగినట్లు అనిపించగా సెకెండ్ ఆఫ్ బాగుంది… సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా మెప్పించాయి అని చెప్పాలి…
లోకేష్ కనగరాజ్ ఎంచుకున్న పాయింట్ పెద్దగా బలంగా లేక పోయినా కూడా యాక్షన్ సీన్ ఎపిసోడ్స్, హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో చాలా వరకు ఫ్యాన్స్ ని సాటిస్ ఫై చేశాడు, కానీ అదే టైం లో మరీ విక్రమ్ రేంజ్ లో ఊహించుకుని LCU లో అద్బుతాలు ఏమైనా ఉంటాయి అనుకుంటే కొంచం నార్మల్ గా అనిపిస్తుంది సినిమా…
మరీ అంచనాలు అందుకోలేదు కానీ ఉన్నంతలో యాక్షన్ లవర్స్, విజయ్ ఫ్యాన్స్ కి సినిమా సాటిస్ ఫై చేస్తుంది, మరీ విక్రమ్ రేంజ్ లో ఊహించుకుని వెళితే కొంచం నిరాశ పడతారు కానీ, లో ఎక్స్ పెర్టేషన్స్ తో వెళితే మట్టుకు సినిమా ఉన్నంతలో బాగానే ఆకట్టుకునే అవకాశం ఎంతైనా ఉంది… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…