బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO Movie) రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా ఆల్ రెడీ 500 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా…
దాటేసి సంచలన రికార్డ్ ను విజయ్ కెరీర్ లో సొంతం అయ్యేలా చేసింది… అన్ని చోట్లా ఆల్ టైం సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపిన ఈ సినిమా అందరికీ శాకిస్తూ సొంతగడ్డ అయిన తమిళనాడులో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ ని అయితే అందుకోలేక పోయింది అని చెప్పాలి.
సినిమాకి అక్కడ స్పెషల్ షోల పర్మీషన్ ని కొన్ని రాజకీయ కారణాల వలన ఇవ్వక పోవడం కలెక్షన్స్ పై కొంచం ఎఫెక్ట్ ను చూపించి ఉండొచ్చు ఏమో కానీ సినిమా ఓవరాల్ గా తమిళనాడులో 100 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా ఇప్పటి వరకు 11 రోజుల్లో….
ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ అటూ ఇటూగా 180 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా అందులో షేర్ ఆల్ మోస్ట్ 95 కోట్ల దాకా ఉంటుందని అంచనా…ఈ లెక్కన అక్కడ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మరో 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఓవరాల్ గా అన్ని చోట్లా రికార్డు కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సినిమా కొన్ని కారణాల వలన సొంత గడ్డ మీద ఇంకా బ్రేక్ ఈవెన్ ని అందుకోక పోవడం కొంత శాకిచ్చే విషయమే అయినా సినిమా లాంగ్ రన్ లో ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.