బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో మోస్ట్ హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(Leo Movie) హైప్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నా కూడా టాక్ మాత్రం మిక్సుడ్ గానే సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమా సెకెండ్ హాల్ఫ్ టాక్ మాత్రం…
ఏమాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేదు, అయినా కూడా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా, ఆడియన్స్ మాత్రం ఓవరాల్ సెకెండ్ ఆఫ్ అండ్ లియో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకా బాగా ఉండాల్సింది అని అంటూ ఉండగా ఈ విషయం డైరెక్టర్ దాకా వెళ్ళగా సినిమా ప్రమోషన్స్ లో…
భాగంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని కామెంట్స్ చేశాడు…అసలు సెకెండ్ ఆఫ్ లో లియో ఫ్రెండ్ జైలులో గౌతమ్ మీనన్ తో చెప్పింది తన వర్షన్ ఫ్లాష్ బ్యాక్ అని, ఆ వర్షన్ చెప్పటప్పుడు కూడా లియో గురించి చెప్పాలి అంటే చాలా ఉందని, ఇది తన వర్షన్ మాత్రమేనని చెప్పాడు…
దాంతో పాటు గౌతమ్ మీనన్ వెళ్ళే టైంలో కూడా ఈ కథకే ఇలా ఉంటే మొత్తం కథ చెబితే ఏమైపోతాడో అంటూ వెళతాడని చెప్పాడు… దాంతో ఇప్పుడు సినిమాను థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ మేం చూసింది మొత్తం అబద్దమేనా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…
డైరెక్టర్ కూడా మీరు సెకెండ్ ఆఫ్ లో చూసింది అసలు సిసలు లియో కథ కాదని చెబుతూ ఉండటంతో లియో అసలు ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ కొందరిలో ఉంటే…ఇంత హైప్ తో వచ్చిన సినిమా మిక్సుడ్ టాక్ రావడంతో డైరెక్టర్ ఇలా కవర్ అప్ కథలు చెబుతున్నాడని అంటున్నారు…మరి ఏది నిజమో తర్వాత వచ్చే సినిమాలతో తెలుస్తుంది…