కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతూ ఉండగా విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా ఒకటి కి మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ కి అతీతంగా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా విజయ్ కెరీర్ లోనే…
ఆల్ టైం బెస్ట్ ఫామ్ లో ఉన్న విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO Movie) ఆడియన్స్ ముందుకు దసరా టైంలో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద కోలివుడ్ లో అలాగే ఇతర ఇండస్ట్రీలలో కూడా…
భారీగా అంచనాలు ఉన్నాయి ఇప్పుడు. ఇక సినిమా ఆడియన్స్ ముందుకు అన్ని భాషల్లో రిలీజ్ కానుండగా హిందీ లో కూడా భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అనుకోకుండా సినిమాకి హిందీ రిలీజ్ లో ఒక ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తూ ఉంది…
హిందీ లో థియేటర్స్ లో సినిమాలను రిలీజ్ చేయాలి అంటే అక్కడ థియేటర్స్ చైన్ అందరికీ సినిమా డిజిటల్ రిలీజ్ 8 వారాల తర్వాతే ఉంటుంది అన్న అగ్రిమెంట్ ను చూపించాల్సి ఉంటుంది. లియో సినిమా డిజిటల్ రిలీజ్ 5 వారలాకు అటూ ఇటూగా ఉండబోతుందని…
టాక్ ఉండగా హిందీ లో లియో సినిమా థియేటర్స్ అగ్రిమెంట్ ఇప్పటికీ పెండింగ్ లోనే ఉందని తెలుస్తుంది. దాంతో సినిమా హిందీ రిలీజ్ పై ఇప్పుడు కొంచం అనుమానాలు మొదలు అయ్యాయి. మరి మేకర్స్ టీం ను ఎలా కన్విన్స్ చేసి ఈ అగ్రిమెంట్ గురించి ఒప్పిస్తారో చూడాలి ఇక…