బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో వచ్చిన మూవీ లైగర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 4 రోజుల ముందే స్టార్ట్ అవ్వగా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దుమ్ము లేపిన సినిమా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కి ముందు రోజు ఆల్ మోస్ట్ 8.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…. ఇండియాలో సినిమా 10.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…
ఇక ఓపెనింగ్స్ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ఉండగా మాస్ సెంటర్స్ లో కూడా ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీ తో దూసుకు పోతున్న సినిమా మొత్తం మీద రికార్డ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి…
టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా ఏ సినిమా కూడా డబుల్ డిజిటల్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకోలేదు కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తెలుగు రాష్ట్రాలలో డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. మొత్తం మీద ఎర్లీ టాక్ మిక్సుడ్ గా ఉండటంతో సినిమా రోజు మొత్తం…
ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మాస్ సెంటర్స్ లో సినిమా ఇదే జోరుని చూపించి ఏ సెంటర్స్ లో కూడా ఇదే విధంగా హోల్డ్ చేస్తే సినిమా తెలుగు రాష్ట్రాలలో 12 నుండి 13 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
అటూ ఇటూగా 16 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా అన్ని చోట్లా హోల్డ్ చేసే రేంజ్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఇంకొంచం ముందుకు వెళుతుందో లేదో చూడాలి. డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.