బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండేవి, కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించకుండా ఓల్డ్ మూవీస్ కన్నా కూడా తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును ఇప్పుడు చాలా కష్టతరం చేసుకుంటుంది అని చెప్పాలి ఇప్పుడు…
ఇదే టైం లో సినిమా హిందీ వర్షన్ మాత్రం అనుకోకుండా మంచి కలెక్షన్స్ ని ముఖ్యంగా తెలుగు లో కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు… ఇందులో కూడా మరో స్పెషల్ ఏంటి అంటే…
సినిమాను బాయికాట్ చేయాలి అంటూ గొడవ చేసి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేసింది బాలీవుడ్ ఆడియన్స్ అవ్వడం, అలాంటి వాళ్ళే తిరిగి సినిమా కి ఇలాంటి టాక్ ఉన్నప్పటికీ కూడా 2 రోజులు తిరగక ముందే 10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సినిమా కి సొంతం అయ్యేలా చేయగా…
ఇప్పుడు వీకెండ్ కలెక్షన్స్ 13.5 కోట్లకు పైగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది, తెలుగు రాష్ట్రాల కన్నా కూడా సినిమా చాలా బెటర్ గా హిందీలో హోల్డ్ చేస్తూ పరుగును ఇప్పుడు కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. డిసాస్టర్ టాక్ అందునా బాయికాట్ ట్రెండ్స్ జరిగిన తర్వాత ఇలాంటి కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా అదే హిట్ టాక్ కనుక వచ్చి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా…
సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉండేది అని చెప్పాలి ఇప్పుడు. ఓ అద్బుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో భారీ నష్టాలు ఆల్ మోస్ట్ కన్ఫాం అయినా కానీ హిందీ లో మాత్రం మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం…