యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే నెలలో భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ మూవీ లైగర్…. డిఫెరెంట్ టైటిల్ తో మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సాంగ్స్ అండ్ గ్లిమ్స్ తోనే మంచి అంచనాలను సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు అన్ని భాషల్లో రిలీజ్ చేశారు.
కాగా ట్రైలర్ చూసిన తర్వాత ఇది ట్రైలరా లేక వీడియో సాంగా అని ఎక్కువ అనిపించింది. ఇక ముందు నుండి ఈ సినిమా బాలీవుడ్ ని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలా అనిపించింది, సీన్స్, డైలాగ్స్ అన్నీ హిందీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసినట్లు అనిపించింది.
రీసెంట్ గా వచ్చిన అకిడి పకిడి సాంగ్ హిందీ లో షూట్ చేసి తెలుగు లిరిక్స్ ని యాడ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ లో కూడా చాలా వరకు హిందీ లిరిక్స్ ఎక్కువగా వినిపించాయి. ఇక డైలాగ్స్ ఏమి ట్రైలర్ లో లేవు… ఒకటి రెండు డైలాగ్స్ వినిపించినా ఏవి కూడా క్లారిటీగా లేవు…
ఇవి పక్కకు పెడితే విజయ్ దేవరకొండ లుక్స్ అండ్ యాటిట్యూడ్ తో మాత్రం ఓ రేంజ్ లో కుమ్మేశాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ అదిరి పోగా రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ అండ్ ట్రైలర్ లో సీన్స్ చూస్తే ఓవర్ ది టాప్ అనిపించేలా ఉంది. ఇక విజయ్ దేవరకొండకి నత్తిని పెట్టడం ట్రైలర్ కొంచం ఇబ్బందిగా అనిపించింది, సినిమాలో ఎలా చూపిస్తారో చూడాలి…
మొత్తం మీద లైగర్ ట్రైలర్ వరకు అయితే కుమ్మేసేలానే ఉంది కాని ఇది ట్రైలర్ కి తక్కువ వీడియో సాంగ్ కి ఎక్కువలా అనిపించింది. కానీ పూరీ తన కెరీర్ లోనే ఎక్కువ టైం తీసుకుని చేస్తున్న సినిమా ఇది… బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది వరకు పూరీ నుండి వచ్చిన సినిమాల రేంజ్ హిట్ టాక్ ని తెచ్చుకుంటే ఈ సారి ఆల్ ఇండియా బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం మాత్రం ఖాయం…