బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లాస్ట్ సినిమా వచ్చి ఆల్ మోస్ట్ రెండున్నర ఏళ్ళు అవుతుంది, ఆ వచ్చిన సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచిన సినిమా. ఆ సినిమానే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా. అలాంటి డిసాస్టర్ మూవీ తర్వాత తక్కువ టైంలో సినిమాలు చేస్తాడు అన్న పేరున్న పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండతో కలిసి ఆల్ మోస్ట్…
2 ఏళ్ళుగా రూపొందుతున్న సినిమా లైగర్… బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల 25న పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా పై అంచనాలు సాలిడ్ గానే ఉండగా అందరి అంచనాలను మించి ఈ సినిమా హీరో…
విజయ్ దేవర కొండ కి సినిమా పై అనుకున్న దాని కన్నా కూడా డబుల్ కాన్ఫిడెంట్స్ కనిపిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీ ప్రీవియస్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ నిరాశ పరిచిందిగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ పై నమ్మకంగా ఉన్నారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకి…
విజయ్ దేవరకొండ ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఈ సినిమా కి ఆడియన్స్ థియేటర్స్ వరకు రావడం మొదటి ఎత్తు అని, థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించడం మాత్రం ఖాయమని, ఇక బాక్స్ ఆఫీస్ లెక్క మాత్రం 200 కోట్ల నుండి మొదలు అవుతుంది అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా కామెంట్స్ చేశాడట విజయ్ దేవరకొండ…
పూరీ జగన్నాథ్ సినిమా హిట్ అయితే సంచలనాలు సృష్టిస్తుంది, తేడా కొడితే గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది, కానీ ఈ సారి మాత్రం విజయ్ దేవరకొండతో పాటు టోటల్ లైగర్ టీం సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెబుతున్నారు. మరి వీళ్ళ అంచనాలను ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి…