యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నాలుగు రోజుల ముందే మొదలు అవ్వగా అన్ని చోట్లా బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా కొనసాగుతున్నాయి. సినిమా నైజాం ఏరియాలో అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా 3.5 కోట్లకు పైగా బుకింగ్స్ ను ఆల్ రెడీ సొంతం చేసుకోగా రిలీజ్ కి ముందు రోజుకి టోటల్ గా….
4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుందని చెప్పాలి. ఇక టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 6.5 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ సొంతం అవ్వగా ఫైనల్ బుకింగ్స్ లెక్క 7 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక సినిమా హిందీతో పాటు టోటల్ గా ఇండియాలో 8 కోట్ల లోపు బుకింగ్స్ గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ డే 1 రికార్డ్ ను నమోదు చేయబోతుండగా మీడియం రేంజ్ హీరోల్లో విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడానికి సిద్ధం అవుతున్నాడు అని చెప్పాలి.
ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ని చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా అవలీలగా 13-15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా హిందీలో జస్ట్ ప్రీమియర్స్ మాత్రమే పడుతూ ఉండగా అక్కడ నుండి సినిమా…
2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా మొదటి రోజు ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి 18-20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టాక్ ని బట్టి షో షోకి కలెక్షన్స్ గ్రోత్ బాగుంటే సినిమా కలెక్షన్స్ రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా ఎలా ఓపెనింగ్స్ ని అందుకుంటుందో చూడాలి.