యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ పరుగును కంప్లీట్ చేసుకోబోతుంది, సినిమా తెలుగు రాష్ట్రాలలో చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో ఆల్ మోస్ట్ పరుగును కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. అందులో భాగంగా కర్ణాటకలో సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యింది.
ఇండియాలో సెకెండ్ వేవ్ తర్వాత అన్ని చోట్లా పరిస్థితులు అనుకున్న విధంగా లేకున్నా తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మిన లవ్ స్టొరీ కర్ణాటక లో 50% ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ 1.4 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది. సినిమా అక్కడ ఇప్పుడు టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి…
మొత్తం మీద 3.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, అందులో షేర్ ఆల్ మోస్ట్ 1.53 కోట్ల దాకా రావడం విశేష్సం, దాంతో ఫైనల్ కలెక్షన్స్ లో ఇవి అప్ డేట్ చేయాల్సి ఉండగా బిజినెస్ మీద అక్కడ సాలిడ్ కలెక్షన్స్ తో క్లాస్ లవ్ స్టొరీ తో మాస్ పవర్ చూపెట్టాడు నాగ చైతన్య…