బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో ఎంటర్ అయ్యింది లవ్ స్టొరీ సినిమా. కాగా సినిమా 13 వ రోజు సాధించిన కలెక్షన్స్ లెక్క తో మొత్తం మీద బ్రేక్ ఈవెన్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ జాబితా లో ఎంటర్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే, కానీ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా కోటి లోపు షేర్ ని….
బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దానికి కారణం సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకున్నా తెలుగు రాష్ట్రాలలో ఇంకా బిజినెస్ ను అందుకోలేదు…. ఆంధ్రప్రదేశ్ లో 50% ఆక్యుపెన్సీ కలెక్షన్స్ మాత్రమే రిపోర్ట్ చేయడంతో సినిమా ఇంకా…
కొన్ని ఏరియాల్లో బిజినెస్ ను అందుకోవాల్సి ఉన్నది…. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 26.3 కోట్ల మార్క్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం తెలుగు లో సినిమా 26.7 కోట్ల దాకా అయినా షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద సినిమా 2 వారాలు కంప్లీట్ అయ్యే టైం కి…
25.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా 15 వ రోజు కొత్త సినిమాల కారణంగా డ్రాప్స్ గట్టిగానే ఉండగా 25.7 కోట్ల కి పైగా షేర్ ని సినిమా అందుకున్నట్లు అయింది. దాంతో మిగిలిన రన్ లో సినిమా మరో కోటి లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంటేనే కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అనిపించుకుంటుంది. ఓవరాల్ గా బిజినెస్ ను…
ఓవర్సీస్ లో అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో బాగా హోల్డ్ చేయడంతో రాబట్టి క్లీన్ హిట్ అయిన సినిమా ఆంధ్రలో 100% ఆక్యుపెన్సీ కలెక్షన్స్ రిపోర్ట్ చేసి ఉంటే ఈ పాటికే సాలిడ్ ప్రాఫిట్స్ లో ఉండేది, కానీ అలా జరగలేదు కాబట్టి సినిమా లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాలలో మరో కోటి లోపు షేర్ ని అందుకుంటే కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అనిపించుకుంటుంది, ఈ కలెక్షన్స్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి.