రీసెంట్ గా టాలీవుడ్ లో చిన్న సినిమానే అయినా కూడా లవ్ రెడ్డి(Love Reddy Movie Review) మీద కొంచం బజ్ ఏర్పడింది…సినిమా బాగా వచ్చింది అంటూ కొంత మంది సెలబ్రిటీలు సినిమాను డీసెంట్ గా ప్రమోట్ చేశారు. మరి సినిమా ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే…
రాయలసీమ కర్ణాటక బార్డర్ లో ఉండే ఒక ఊరిలో ఉండే హీరోకి 30 ఏళ్ళు దాటినా పెళ్లి సెట్ అవ్వదు. ఇలాంటి టైంలో బస్ జర్నీలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు….హీరోయిన్ తో లవ్ లో పడిన తర్వాత హీరో లైఫ్ మారుతుంది. తన లవ్ విషయం హీరోయిన్ కి చెప్పిన తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
చాలా నార్మల్ గా స్టార్ట్ అయిన సినిమా అక్కడక్కడా కొన్ని పర్వాలేదు అనిపించే సీన్స్ తో ఆకట్టుకోగా, కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా పర్వాలేదు అనిపించేలానే ఫస్టాఫ్ సాగుతుంది. సెకెండ్ ఆఫ్ లో మెలోడ్రామా పార్టు పార్టులుగా పర్వాలేదు అనిపించినా…
కొంచం ఓపికతో చూస్తె ఓకే అనిపిస్తూ సాగి ప్రీ క్లైమాక్స్ నుండి ఊపు అందుకుని హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో ఎండ్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ నుండి ఎండ్ వరకు సినిమా బెటర్ గా అనిపిస్తూ కొంచం ఎమోషనల్ అయ్యేలా చేయగా మిగిలిన సినిమా మాత్రం చాలా నార్మల్ గా సాగడం…
మేజర్ డ్రా బ్యాక్ అని చెప్పాలి. డైరెక్టర్ హానెస్ట్ గానే కథ ని చెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఓవరాల్ గా చెప్పే క్రమంలో సరైన లవ్ ట్రాక్ ను చెప్పలేక పోయాడు, దాంతో మంచి ఫీల్ ఇవ్వాల్సిన లవ్ సీన్స్ ఎదో పై పైన సాగిన ఫీలింగ్ కలిగి డ్రాగ్ అవ్వగా…
ప్రీ క్లైమాక్స్ తో క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం బాగా రావడంతో ముందు చాలా ఓపికతో చూసే ఆడియన్స్ క్లైమాక్స్ చూసిన తర్వాత ఓవరాల్ గా సినిమా ను ఒకసారి చూడొచ్చు అని ఫీల్ అవుతారు…కానీ సినిమాని చూడాలి అంటే ఓపిక అవసరం, ఓవరాల్ గా హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ కోసం మిగిలిన సినిమాను ఓపికగా చూస్తె ఒకసారి చూసేలా ఉంటుంది లవ్ రెడ్డి మూవీ.