3 కోట్లకి అమ్మితే..టోటల్ గా వచ్చింది ఇది!!

0
643

    లాస్ట్ ఇయర్ లవర్స్ డే వీకెండ్ లో రిలీజ్ చేసిన ఒక సినిమా సాంగ్ లో ఒక్క బిట్ లో కన్ను కొట్టి కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన లవర్స్ డే సినిమా ఏడాది తర్వాత లవర్స్ డే కానుకగా సౌత్ లో భారీ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే, రిలీజ్ కి ముందు నుండి లీడ్ పెయిర్ ఓవర్ నైట్ లో వచ్చిన క్రేజ్ తో కొంచం తలపోగరు చూపారు అన్న అపవాదు ని మూటగట్టు కోగా…

సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే భారీ ఫ్లాఫ్ టాక్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది, సాదా సీదా సినిమా కి ఊహించని క్లైమాక్స్ బిగ్గెస్ట్ ప్లస్ అవుతుని హోప్స్ పెంచుకున్న టీం కి ఆ క్లైమాక్స్ బిగ్గెస్ట్ మైనస్ అవ్వడం తో తేరుకోలేక పోయారు.

తర్వాత క్లైమాక్స్ ని మార్చామంటూ పబ్లిసిటీ ఫుల్లు గా చేసినా ప్రయోజనం లేక పోయింది, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక తొలిరోజు రెండు రాష్ట్రాల్లో 73 లక్షల దాకా షేర్ ని అందుకున్నా ఫైనల్ రన్ లో కేవలం 1.2 కోట్ల రేంజ్ షేర్ తో నే సరి పెట్టుకుంది.

తెలుగు లో సినిమా ని టోటల్ గా 3 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 4 కోట్ల లోపు టార్గెట్ తో బరిలోకి దిగింది, కానీ టోటల్ గా 1.2 కోట్ల రేంజ్ షేర్ ని మాత్రమె అందుకుని డిసాస్టర్ గా మిగిలిపోయింది, కేరళ వర్షన్ లో అక్కడ ఓన్ గా రిలీజ్ అవ్వడం తో సినిమా కలెక్షన్స్ ఎంత వచ్చినా…

అవి నిర్మాతకే చెల్లుతాయి. మొత్తం మీద ఓవర్ నైట్ లో వచ్చిన క్రేజ్ ని ఏడాది పాటు ఎంజాయ్ చేసిన టీం కి పట్టుమని వారం కూడా నిలవలేని సినిమా తో టోటల్ ఫేమ్ దాదాపు గా మాయం అయ్యే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. మరి ప్రియా ప్రకాష్ వారియర్ తన ఇంపాక్ట్ ని రాబోయే సినిమాల్లో చూపుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!