Home న్యూస్ లవ్ స్టొరీ 29 డేస్…పుష్ప 23 డేస్…భీమ్లా నాయక్ 4 డేస్…ఊచకోత ఇది!!

లవ్ స్టొరీ 29 డేస్…పుష్ప 23 డేస్…భీమ్లా నాయక్ 4 డేస్…ఊచకోత ఇది!!

3172
0

టాలీవుడ్ లో ఇది వరకు సినిమాల టీసర్ లకు ట్రైలర్ లకు లక్షల లైక్స్ రావడమే చాలా కష్టం అయ్యేది కానీ తర్వాత తర్వాత మన హీరోల ఫ్యాన్స్ అవలీలగా ఈ రికార్డులను అందుకోవడం మొదలు పెట్టగా తర్వాత సాంగ్స్ విషయం లో కూడా కొన్ని అద్బుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సాలిడ్ వ్యూస్ తో పాటు లైక్స్ ని కూడా దక్కించుకోగా ఇది తర్వాత వీడియో సాంగ్స్ కన్నా ముందు…

ఆడియన్స్ ముందుకు వచ్చే లిరికల్ వీడియోల దాకా వెళ్ళింది. ఈ మధ్య కాలంలో కొన్ని లిరికల్ వీడియోలకు మొదటి 24 గంటల లోనే అల్టిమేట్ రెస్పాన్స్ వస్తూ ఉండగా లైక్స్ పరంగా కూడా కొత్త రికార్డులను నమోదు చేస్తూ దుమ్ము లేపుతున్నారు ఫ్యాన్స్… తెలుగు లో ఇప్పటి వరకు వచ్చిన…

లిరికల్ వీడియోలలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ తరుపున అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…

ఇది వరకు లవ్ స్టొరీ సినిమా లోని సాయి పల్లవి సారంగధరియా సాంగ్ 29 రోజుల టైం తీసుకుని 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఈ రికార్డ్ ను రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని దాక్కో దాక్కో మేక సాంగ్ తెలుగు వర్షన్ 23 రోజుల్లో రికార్డ్ బ్రేక్ చేసి కొత్త రికార్డు తో దుమ్ము లేపింది…

ఈ రికార్డ్ కొట్టిన తర్వాత రోజే రిలీజ్ అయిన 4 రోజుల 5 గంటల 35 నిమిషాల టైం మాత్రమే తీసుకున్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ రికార్డ్ ను అందుకుని టాలీవుడ్ తరపున అప్ కమింగ్ సాంగ్స్ కి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి పెట్టింది. మరి ఫ్యూచర్ లో ఏ సాంగ్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here