Home న్యూస్ లూసిఫర్2 మాస్ రచ్చ….15.5 కోట్ల మెంటల్ మాస్ జాతర ఇది!!

లూసిఫర్2 మాస్ రచ్చ….15.5 కోట్ల మెంటల్ మాస్ జాతర ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే కొంచం చిన్న ఇండస్ట్రీగా పేరున్నా కూడా ఎప్పటి కప్పుడు డిఫెరెంట్ జానర్ మూవీస్ చేస్తూ కొన్ని సార్లు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటున్న మలయాళ ఇండస్ట్రీ ఇప్పుడు ఇతర ఇండస్ట్రీల రేంజ్ లో పాన్ ఇండియా సినిమాతో మాస్ రచ్చ చేయబోతుంది…

మలయాళ ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ మూవీగా మారిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా…

రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ లో అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది ఈ ట్రైలర్…శూర్ షాట్ గా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీస్తుంది అంటూ ఓ రేంజ్ లో అందరిలో నమ్మకం కలిగేలా చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత…

బజ్ అమాంతం పెరిగిపోగా ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టేటస్ ఊహకందని బూస్టప్ ను సొంతం చేసుకోవడం విశేషం….మలయాళ సినిమాలకు సాలిడ్ మార్కెట్ ఉండే గల్ఫ్ ఏరియాలతో పాటు ఈ సినిమాకి నార్త్ అమెరికా…యుకె లాంటి ఏరియాల్లో సైతం…

సెన్సేషనల్ బుకింగ్స్ సొంతం అవ్వగా ఆల్ మోస్ట్ రిపోర్ట్ అయిన లోకేషన్స్ లో 1.8 మిలియన్ మార్క్ రేంజ్ లో ప్రీ బుకింగ్స్ సొంతం అవ్వగా ఇండియన్ కరెన్సీలో సినిమా ఆల్ మోస్ట్ 15.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని ఆల్ రెడీ దాటేసి సంచలనం సృష్టించగా…

ఇంకా కేరళ ఏరియా అలాగే ఇతర భాషల బుకింగ్స్ ఓపెన్ అవ్వకముందే మలయాళ సినిమాల పరంగా బిగ్గెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ తో రచ్చ చేస్తున్న ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ డే 1 రికార్డ్ ను మలయాళ సినిమాల్లో నమోదు చేయడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. మరి అది ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here