మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా మీద ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మలయాళంలో అయితే అంచనాలు మరో లెవల్ లో ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను…
ఇప్పుడు అన్ని భాషలకు గాను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల జాతర సృష్టించడం ఖాయమని అనిపిస్తూ ఉందని చెప్పాలి….లూసిఫర్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయ్యిందో అక్కడి నుండే ఓపెన్ అయిన సీక్వెల్ ట్రైలర్ అడుగడుగునా…
టాప్ నాట్చ్ విజువల్స్ తో ఎక్స్ లెంట్ సినిమాటోగ్రఫీతో మాస్ కుమ్ముడు కుమ్మేసింది… పృద్వీరాజ్ సుకుమార్ ఎక్స్ లెంట్ డైరెక్షన్ ట్రైలర్ లోనే సాలిడ్ గా మెప్పించగా….స్టోరీ పాయింట్ ను కూడా రివీల్ చేశారు…అసలు హీరో బ్యాగ్రౌండ్ ఏంటి అనేది…
అందరిలోనూ డౌట్ నెలకొనగా….హీరో ఎంత పవర్ ఫుల్ వ్యక్తి అనేది చెబుతూ తన ఫ్లాష్ బ్యాక్ ను రివీల్ చేస్తారు…ఈ క్రమంలో రాష్ట్రం మళ్ళీ కష్టాల్లో ఉందీ అని తెలుసుకున్న హీరో తిరిగి వచ్చి ఏం చేశాడు అన్నది లూసిఫర్2 స్టోరీ పాయింట్ గా ట్రైలర్ లో చూపించారు…
మరోసారి మోహన్ లాల్ తన ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్రజెన్స్ తో మాస్ కుమ్ముడు కుమ్మేశాడు…తన డైలాగ్స్ తక్కువే ఉన్నప్పటికీ ట్రైలర్ మొత్తం చర్చ తన గురించే జరుగుతుంది. ఇక పృద్వీరాజ్ కనిపించింది తక్కువే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్ కూడా కుమ్మేసింది…
ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న సినిమా ట్రైలర్ రేంజ్ లోనే ఆకట్టుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఊరమాస్ జాతర సృష్టించడం ఖాయమని చెప్పాలి…తెలుగు లో కూడా సినిమా జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి.