బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie Review) గ్రాండ్ గా దీపావళి కానుకగా రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడగా సినిమా ఇప్పుడు ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టోరీ పాయింట్ కి వస్తే….మగధ బ్యాంకులో 6 వేల జీతానికి పనిచేసే హీరోకి ఆ జీతం కుటుంబాన్ని నడపడానికి ఏమాత్రం సరిపోదు…ఇలాంటి టైంలో ఎలాగైనా ఎదగాలి అని ఫిక్స్ అయిన హీరో బ్యాంక్ అకౌంట్ లో కొట్లలో డబ్బు వస్తుంది….ఆ డబ్బు వెనక ఉన్న మిస్టరీ ఏంటి…హీరో ఏం చేశాడు….. ఆ డబ్బు సంపాదించిన తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
కొన్నేళ్ళ క్రితం వచ్చిన స్కాం 1992 వెబ్ సిరీస్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది…స్టాక్ మార్కెట్ మీద వచ్చిన బెస్ట్ సిరీస్….హర్షద్ మెహతా స్టోరీతో వచ్చిన ఈ సిరీస్ అలాగే షేర్ మార్కెట్ మీద కొంత అవగాహన ఉంటే లక్కీ భాస్కర్ మూవీ చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది…
షేర్ మార్కెట్ మీద పెద్దగా అవగాహన లేకుంటే కొంచం అక్కడక్కడా ఇబ్బందిగా అనిపిస్తుంది….సినిమా స్టార్టింగ్ నుండే ఫుల్ రేసీ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ పరుగులు పెట్టించాడు….ఆ స్పీడ్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ఎక్కడా కూడా ఎక్కువ సేపు బోర్ ఫీల్ అవ్వకుండా జాగ్రత్త తీసుకుని…
పెర్ఫెక్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. కొన్ని చోట్ల కథ డ్రాగ్ అయినట్లు లేదా కొంచం స్లో అవుతుందా అనుకునే టైంకి ఓ మంచి సీన్ తో తర్వాత సీన్ మీద ఆసక్తి పెరిగిపోతుంది…ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకెండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగా కుదరగా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేస్తుంది…
పెర్ఫార్మెన్స్ పరంగా దుల్కర్ సల్మాన్ తన రోల్ లో చెడుగుడు ఆడేసుకున్నాడు, మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు తన పెర్ఫార్మెన్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా, డైలాగ్స్ తోనే హీరోయిజం ఎలివేట్ అయ్యేలా చేశాడు డైరెక్టర్…ఇక మీనాక్షి చౌదరి ఓకే అనిపించగా చిన్న బాబు కూడా ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు.
ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వరకు పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది, కొన్ని చోట్ల కొంచం డ్రాగ్ అయినా చాలా వరకు స్క్రీన్ ప్లే సూపర్బ్ గా ఉండటం విశేషం, సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ కి తగ్గట్లు బాగా మెప్పించగా డైరెక్టర్ గా వెంకీ అట్లూరి మరోసారి…
పెర్ఫెక్ట్ మూవీతో ఆకట్టుకున్నాడు….కొంచం కథ కొన్ని చోట్ల గెస్ చేసేలా ఉండటం, కొన్ని చోట్ల కథ మరీ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం, కొన్ని చోట్ల లాజిక్ లు మిస్ అవ్వడం లాంటివి జరిగినా కూడా ఆడియన్స్ ఇవేవి పట్టించుకోకుండా సినిమా ను ఎంజాయ్ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది.. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…