Home న్యూస్ లక్కీ భాస్కర్ ట్రైలర్ రివ్యూ….శూర్ షాట్ హిట్ బొమ్మ!!

లక్కీ భాస్కర్ ట్రైలర్ రివ్యూ….శూర్ షాట్ హిట్ బొమ్మ!!

0
Dulquer Salmaan Lucky Baskhar Trailer Review
Dulquer Salmaan Lucky Baskhar Trailer Review

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న మూవీస్ లో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie) సినిమా భారీ లెవల్ లో రిలీజ్ కానుండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత… 

సినిమా శూర్ షాట్ హిట్ బొమ్మలా అనిపిస్తూ ఉంది ఇప్పుడు… ట్రైలర్ లోనే సినిమా కథ మొత్తాన్ని మెయిన్ ట్విస్ట్ లు కాకుండా రివీల్ చేసినట్లు అనిపించింది…చాలా తక్కువ జీతంతో ఫ్యామిలీని మెయిన్ టైన్ చేస్తున్న హీరో లైఫ్ లో ఎదగాలి అని ఫిక్స్ అవుతాడు…

అలాంటి టైంలో సడెన్ గా తన దగ్గర లెక్కకు మించి డబ్బు వస్తుంది, చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అంత డబ్బు ఎక్కడిది అని ఆశ్యర్యపోతారు. ఇలాంటి టైంలో డబ్బు లెక్కకు మించి సంపాదించిన హీరోలో వచ్చిన మార్పులు ఏంటి, ఆ మార్పుల వలన ఫ్యామిలీ లో….

ఏర్పడిన గొడవలు ఏంటి…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మొత్తం మీద సినిమా కథగా అనిపిస్తుంది ట్రైలర్ లో…ట్రైలర్ లో ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు పెర్ఫెక్ట్ ట్రైలర్ కట్ గా అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ విజువల్స్ కూడా బాగా మెప్పించాయి…

ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను భారీగా పెంచేసింది…సినిమా కూడా ఇదే రేంజ్ లో ఆకట్టుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ గ్యారెంటీ లెవల్ లో వర్కౌట్ అయ్యే మూవీగా అనిపించడం ఖాయమని చెప్పాలి. ఇక దీపావళి పోటిలో సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here