బాక్స్ అఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ యునానిమస్ పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటి దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie)…దీపావళి వీకెండ్ లో ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో…
అంచనాలను మించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎపిక్ మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా తర్వాత కేరళ తమిళ్ లో కూడా కుమ్మేసింది..కర్ణాటకలో కూడా మంచి జోరుని చూపించింది…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో పోటిలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రచ్చ చేసిన ఈ సినిమా సాలిడ్ ప్రాఫిట్ ను కూడా దక్కించుకుంది…సోలో రిలీజ్ దక్కి ఉంటే ప్రాఫిట్ మార్జిన్ ఇంకా సాలిడ్ గా సొంతం అయ్యి ఉండేది. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో సినిమా…
ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie Telugu States Collections (Inc GST)
👉Nizam: 10.21Cr~
👉Ceeded: 2.90Cr~
👉Andhra: 9.20Cr~
AP-TG Total:- 22.31CR(38.90Cr~ Gross)
తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్ల దాకా ఉండగా టార్గెట్ మీద ఏకంగా 7.31 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది సినిమా…
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie Total World Wide Collections Approx
👉Telugu States – 38.90Cr
👉Kerala – 22.20Cr
👉Karnataka – 7.05Cr
👉Tamilnadu – 16.50Cr
👉ROI – 2.15Cr
👉Overseas – 27.50Cr***approx
Total WW collection – 114.30CR(55.60CR~ Share) Approx
మొత్తం మీద సినిమా తెలుగులో సీతారామం తర్వాత మరో 100 కోట్ల సినిమాగా నిలిచింది దుల్కర్ కెరీర్ లో…ఓవరాల్ గా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 27.6 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…ఊహకందని ప్రాఫిట్ తో దుమ్ము దుమారం లేపింది.